అల్లుడు కళ్యాణ్ దేవ్ కి ఇచ్చిపడేసిన మెగాస్టార్ చిరంజీవి?

అదేమిటోగాని మెగా కుటుంబంలో కొంత మందికి పెళ్లిల్లు అస్సలు కలిసిరావడం లేదు. మొన్నటికి మొన్న నాగబాబు కూతురు నిహారిక, భర్త చైతన్యకు విడాకులు మంజూరు అయిన సంగతి విదితమే. ఇక ఎన్నాళ్ళనుండో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ, తన ప్రస్తుత భర్త కళ్యాణ్ దేవ్ కి సంబందించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం. ఇక శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చాక విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో వీరి ప్రేమ వివాహం అయితే పెనుదుమారాన్నే సృష్టించింది.

అది కాస్త పెటాకులు అవడంతో ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మంచి సంబంధంతో రెండో పెళ్లి చేసుకున్న శ్రీజ భర్త, నటుడు కళ్యాణ్ దేవ్ కి కూడా విడాకులు ఇచ్చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ న్యూస్ మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. అంటే అఫీషియల్ గా ఈన్యూస్ బయటికి రాకపోయినా చూస్తున్న దృశ్యాలు ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండోసారి కూడా విడాకులు తీసుకుంది జనాలు ఓ నిర్ణయానికి వచ్చారు. మొదటి భర్త విడాకులు తీసుకున్న తర్వాత శిరీష్ భరద్వాజ్, శ్రీజ ని ఏ విధంగా టచ్ చేయలేదు. తన బతుకేదో బతుకుతున్నాడు. కానీ కళ్యాణ్ దేవ్ మాత్రం మెగా కూతురు శ్రీజకు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా కౌంటర్స్ ఇస్తున్నారు.

ఇక ఈ విషయాలు మన మెగాస్టార్ చెవిన పడ్డాయో ఏమోగానీ, కళ్యాణ్ దేవ్ పైన ఆయన మిక్కిలి కోపంగా వున్నారని వినికిడి. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ ని ఇంటికి పిలిపించుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసాడని సమాచారం. ‘జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఎవరి బతుకు వారు హాయిగా బతకండి. ఒకరినొకరు కెలుక్కోవద్దు!’ అంటూ సున్నితంగా మందలించాడట చిరంజీవి. విషయం ఏమిటంటే కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తాను పడ్డ బాధలను ఓపెన్ గా చెప్పుకొస్తూ పరోక్షకంగా శ్రీజ పై కౌంటర్స్ వేస్తున్నారు.

ఇక లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని, హీరో కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఏ కామెంట్ చేసినా అది మెగా డాటర్ శ్రీజకి ఆపాదించేస్తున్నారు. అతగాడు తాజాగా… “జీవితంలో మర్చిపోలేని విషయాలు చాలా ఉంటాయి. అలాంటి వాటిని వదులుకునే ధైర్యం వున్నపుడే అవి మనకి మధుర క్షణాలుగా మారుతాయి. లేదంటే చేదు జ్ఞాపకాలు అవుతాయి. మీరు ఏమంటారు?” అంటూ రాసుకు వచ్చాడు. దీంతో కళ్యాణ్ దేవ్ శ్రీజ పైన కౌంటర్ ఇచ్చాడు అంటూ ఓ వర్గం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది నిజమో ఏది అబద్ధమో అంతా ఆ భగవంతుడికే తెలియాలి. ఇది ఇలా ఉంటే కళ్యాణ్ దేవ్ ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ మంచి బిజీగా ఉన్నాడు.