Govt Jobs : 1,625 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలా అప్లై చేయాలంటే..!!

Govt Jobs : ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టులను కేవలం కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయనున్నట్లు గా తెలుస్తోంది. 1,625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Notification for 1,625 government jobs
Notification for 1,625 government jobs

1).పోస్టుల వివరాలు:1625
ఇందులో ఎలక్ట్రానిక్ మెకానికల్ పోస్టులు-814
ఎలక్ట్రీషియన్ పోస్టులు-184
ఫిట్టర్ పోస్టులు-627 కలవు.

2). అర్హతలు : గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్ మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడ్ లో రెండు సంవత్సరాల అనుభవంతో పాటు ఐటిఐ సర్టిఫికెట్ కూడా పొంది ఉండాలి.

3). ఎంపిక ఎలా చేస్తారు అంటే:
1).అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ..
2).అభ్యర్థుల మెరిట్ ఆధారంగా..1:4 అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు.
3). షార్ట్ లిస్టు అనంతరం అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

4). దరఖాస్తును ఎలా అప్లై చేయాలంటే:
దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది.

ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్..http://careerrs.ecil.co.in/login.php ను సందర్శించాలి.ఆ తరువాత నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై లింక్ మీద క్లిక్ చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు తప్పులు లేకుండా దరఖాస్తు ఫారం నింపాలి.

5). వయస్సు : అప్లై చేసే అభ్యర్థులు 30 సంవత్సరాల మించి వయసు ఉండకూడదు.

6). దరఖాస్తు చివరి తేదీ : అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 11వ తేదీ చివరి తేదీ గా నిర్ణయించడం జరిగింది. అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి.

7) జీతభత్యాలు : ఎంపికైన అభ్యర్థుల పోస్టులో ఆధారంగా ప్రతి నెల రూ.20,480 నుంచి రూ. 24,780 వరకు నెలవారీ జీతం అందిస్తారు.మీలో ఎవరైనా సరే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు షేర్ చేయగలరు.