Army Jobs : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..?

Army Jobs : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం చక్కటి శుభవార్తను అందిస్తూనే ఉన్నది. తాజాగా భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీలో..SSC ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అర్హులైన ఎన్ సీ సీ అభ్యర్థులు. (పురుషులు, మహిళలు) దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను NCC స్పెషల్ ఎంట్రీ స్కీం కింద 52వ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Jobs in Indian Army
Jobs in Indian Army

1).మొత్తం ఖాళీల సంఖ్య – 55
1). ఇందులో మొత్తం పురుషుల పోస్ట్లు – 55 కలవు.
2). మహిళలు -5
ఇక ఇందులో యుద్ధ ప్రమాదంలో గాయపడిన ఆర్మీ సిబ్బంది లెక్కలు కూడా పోస్ట్ కలవు.

2). పోస్టుల వివరాలు : షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్ సీ సీ ఆఫీసర్ పోస్టుల భర్తీ.

3). వయస్సు : అభ్యర్థులు జూన్ -1- 2022 నాటికి అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

4). జీతభత్యాలు : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు.

5). అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా NCC-C సర్టిఫికెట్ ఉండాలి. యుద్ధ ప్రమాదాలలో గాయపడిన ఆర్మీ సిబ్బందికి NCC – C సర్టిఫికెట్ అవసరం.

6). ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.. ఫేజ్ -1 లో ఎంపికైన అభ్యర్థులకు ఫేజ్ -2 ఎస్ ఎస్ బీ ఇంటర్వ్యూ ఉంటుంది.

7). దరఖాస్తు ఎలా అప్లై చేసుకోవాలంటే : ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం ధరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 13వ తేదీ.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://joinindianarmy.nic.in/Authentication.aspx సంప్రదించండి.