Health Benefits : కడుపులో మంట అధికంగా వస్తోందా..ఇలా చెక్ పెట్టండి..!!

Health Benefits : మారుతున్న జీవన శైలిలో కారణంగా అప్పుడప్పుడు కడుపులో అలాగే ఛాతిలో కూడా మంట వస్తోందని.. ఇప్పటికే ఎంతోమంది సతమతమవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా ఈ సమస్యను ఎదుర్కోవడం గమనార్హం.. కడుపులో అలాగే ఛాతిలో మంట ఎందుకు వస్తుంది అంటే.. జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి ఉత్పత్తయ్యే రసాలు అలాగే ఆమ్లాలు అవసరానికి మించి విడుదలైనప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. పిత్తం అధికంగా ఉండే వారిలో.. మానసికంగా ఒత్తిడి తో బాధపడుతున్న వారిలో.. అలాగే వివిధ రకాల జబ్బులకు మందులు వాడుతున్న వారిలో.. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపించడం గమనార్హం.. మీ కుటుంబ సభ్యులు.. సన్నిహితులు..

తెలిసిన వారు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి వారికి సమాచారాన్ని అందించగలరు.కడుపులో మంట అధికంగా ఉన్నప్పుడు కారం, మసాలా దినుసులు , పులుపు వంటి పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది. అంతేకాదు నూనెలో వేయించిన ఫ్రైస్ , మాంసాహారం కూడా తక్కువగా తీసుకోవాలి . ఇక ప్రతి రోజూ కూడా నిర్ణీత వేళల్లో ఆహారం తీసుకోవడమే కాదు కొద్ది కొద్ది మొత్తాల్లో ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నా కూడా కడుపులో మంట అధికంగా ఉంటే ఆపిల్, ద్రాక్ష, జీలకర్ర , పుదీనా , మజ్జిగ, పెరుగు లాంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Is there a lot of inflammation in the stomach
Is there a lot of inflammation in the stomach

బీట్ రూట్ నుంచి తీసిన రసం ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు తాగాలి. అలాగే లేత కొబ్బరి నీళ్లు కూడా సమస్యను తగ్గిస్తాయి. జీలకర్ర పొడి చేసుకొని నీటిలో కలుపుకొని తాగడం వల్ల కడుపులో మంట త్వరగా తగ్గుతుంది. రోజూ ఆహారం తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని.. గోరువెచ్చని నీటిని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది. భోజనం తిన్న తర్వాత కూడా కడుపులో మంట సమస్యను తగ్గించుకోవచ్చు. ఇక అతిమధురం కూడా ఎసిడిటి సమస్యను అదుపులోకి తీసుకు వస్తుంది.