Diabetes : గుడ్డు తింటే మధుమేహం వస్తుందా.. నిజమెంత..?

Diabetes : ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఇష్టమైన అల్పాహారం కోడి గుడ్డు అని చెప్పవచ్చు. కోడి గుడ్డు పోషకాల నిధి. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజూ తింటే మంచి పోషకాలు మనకు అందుతాయని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే గతంలో మాంసాహారులు మాత్రమే కోడి గుడ్డును తినడానికి ఇష్టపడే వారు.. ముఖ్యంగా కొన్ని వర్గాలకు చెందిన వారు కోడిగుడ్డు తినడానికి అసలు ఇష్టపడేవారు కాదు.. కానీ ఇందులో ఉండే పోషకాలను గమనించిన తర్వాత శాఖాహారులు సైతం కోడిగుడ్లు తినడానికి అలవాటు పడిపోతున్నారు. ఇక అందరూ తినవచ్చునని డబ్ల్యుహెచ్వో కూడా స్పష్టం చేసింది. కానీ ప్రతి రోజు కోడి గుడ్డు తినడం వల్ల 60 శాతం డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందట.

ఇకపోతే ఇప్పటికే మీ ఇంట్లో .. బంధుమిత్రులలో..స్నేహితులలో ఎవరైనా సరే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కోడిగుడ్లు తింటున్నట్లు అయితే.. తినడాన్ని తగ్గించుకోవడమే మంచిది అని.. అది ఎలాగో ఈ ఆర్టికల్ వారికి వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి వారి ఆరోగ్యానికి దోహదపడండి.కోడిగుడ్డులో మనకు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి తో పాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే చాలామంది ఈ ప్రోటీన్ల కోసమే ఎక్కువగా ఈ కోడి గుడ్డు ను తింటూ ఉంటారు. అయితే గరిష్ట ప్రయోజనాల కోసం మనం ప్రతి రోజు కూడా ఒకటి లేదా రెండు కోడి గుడ్లను మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.. తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఎవరైతే కోడిగుడ్లు అధికంగా తింటారో వారికి షుగర్ ప్రేరేపిస్తుంది అని తేలిందట.

Does eating an egg cause diabetes
Does eating an egg cause diabetes

రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు.. ప్రతిరోజు తినే వారికి షుగర్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది.అయితే ఈ సమస్య ఎక్కువగా పురుషుల కంటే మహిళల్లోనే ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు.. ఇక అధ్యయనం ఎవరు జరిపారనే విషయానికొస్తే ఖతార్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం తో కలిసి చైనా మెడికల్ యూనివర్సిటీ వారు ఈ అధ్యయనం నిర్వహించగా ఇందులో రెండు కంటే ఎక్కువ గుడ్లు తినే వారిలో 25 శాతం మధుమేహం వచ్చే అవకాశం ఉంటుందట. ఇక క్రమం తప్పకుండా 50 గ్రాముల కంటే ఎక్కువ గుడ్లు తినే పెద్దవాళ్ళలో 60 శాతం వచ్చే ప్రమాదం ఉందని సమాచారం.ఈ పరిశోధనలో 50 సంవత్సరాలకు పైబడిన వారిని.. చైనా నుంచి 8,545 మంది పెద్దలు చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కోడిగుడ్డును తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది.