Beauty Tips : చర్మం పై మొటిమలు, పిగ్మెంటేషన్ తొలగించాలంటే..?

Beauty Tips : ముఖ్యంగా చర్మం ఏ రంగులో ఉన్నా సరే.. దానిని శుభ్రంగా తాజాగా ఉంచుకోవడం మొదటిగా చేయవలసిన పని. అందుకే చర్మం కోసం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలం వచ్చింది కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే చర్మంపై పిగ్మెంటేషన్, మొటిమలు , మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో వచ్చే ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవాలి అంటే చాలా మంది వంటింటి చిట్కాల పై ఆధార పడుతున్నారు.

ఇక మీ ఇంట్లో మీఅమ్మ..చెల్లి..అక్క..పిన్ని..ప్రేయసి ఇలా ఎవరైనా సరే ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న అట్లయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పబోయే సమాచారాన్ని వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా మీకు ఇష్టమైన వారికి షేర్ చేసి వారికి కూడా సమస్యల నుంచి విముక్తి కలిగేలా చేయవచ్చు.. ఇకపోతే విడ్మెట్ టేషన్ మొటిమలను దూరం చేసే చిట్కాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

To remove pimples and Pigmentation Treatment for Skin
To remove pimples and Pigmentation Treatment for Skin

పిగ్మెంటేషన్ : సాధారణంగా పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.. మంగు మచ్చలలా కనిపించే ఇది చాలా రకాలుగా ఉంటుంది. హార్మోన్ల మార్పుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది అని వైద్యులు తెలియజేస్తున్నారు. గర్భం దాల్చినప్పుడు లేదా గర్భ నిరోధక మాత్రలు తీసుకున్నప్పుడు ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. గర్భం వచ్చిన తర్వాత స్త్రీలలో ఆటోమేటిక్ గా ఈ సమస్య తగ్గిపోతే.. మరికొంతమంది గర్భ నిరోధక మాత్రలు తీసుకోవడం నిలిపివేసిన తర్వాత ఈ సమస్య తగ్గిపోతుంది. అధిక ఒత్తిడి కూడా పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది అని చెప్పవచ్చు.

ఇక ఇటువంటి సమస్యలు ఏమీ లేకపోయినా సరే పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నట్లైతే ప్రతిరోజు బియ్యం నానబెట్టి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల సమస్య త్వరగా అంతం అవుతుంది. మొటిమలు , మొటిమల తాలూకు మచ్చలు కూడా తొలగించుకోవాలి .. లేకపోతే ఎంత అందంగా ఉన్నా సరే వీటివల్ల అందవిహీనంగా మారిపోతారు. మొటిమలకు ఎన్నో రకాల చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. పసుపు , పాల మీగడ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మొటిమలపై అప్లై చేయడం వల్ల పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వల్ల మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. పాల మీగడ వల్ల చర్మం తాజాగా నిగనిగలాడడమే కాకుండా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.