అంత వాళ్ళ ఫ్యామిలీ ఇష్ట ప్రకారమే విడాకులు తీసుకున్నాం అంటున్న నిహారిక భర్త?

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారం గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భర్త చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు మనస్పర్థలు తలెత్తాయని, కొన్నాళ్లుగా ఈ దంపతులిద్దరూ విడిగానే ఉంటున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ వార్తలను నిజం చేస్తూ మంగళవారం కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. కాగా, ఈ విషయంపై తాజాగా నిహారిక మరియు చైతన్య స్పందించడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పరస్పర అంగీకారంతోనే తామిద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా వారు ప్రకటించారు.

ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా వారు చెరొక పోస్ట్ పెట్టడం గమనించవచ్చు. “నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇక నుంచి ఎవరి జీవితం వారు బతకనున్నాం. ఈ సున్నిత సమయంలో మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఇకపై మేమిద్దరం కొత్తగా ప్రారంభించబోయే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం. ఇప్పటి వరకూ నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా కృతజ్ఞతలు. నన్ను అర్థం చేసుకున్నందకు అందరికీ ధన్యవాదాలు!” అంటూ నిహారిక పోస్ట్ పెట్టారు.

అదేవిధంగా చైతన్య సైతం ఇదే ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేయడం మనం గమనించవచ్చు. అయితే ఈ విషయాన్ని కొన్ని రకాల మీడియాలు పనిగట్టుకొని మరీ కాంట్రవర్సీ చేయడానికి చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా మెగా కుటుంబం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విడాకుల విషయంలో మెగా కుటుంబాన్ని మధ్యలోకిలాగే శునక రాజకీయాన్ని చేస్తున్నాయి. అయితే వివాహం అనేది రెండు మనసులకు, మనుషులకు సంబందించినది. వారికి నచ్చకపోవడంతోనే వారు విడిపోయారు తప్పితే ఈ విషయంలో కుటుంబాల ప్రమేయం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇకపోతే 2020 డిసెంబర్‌లో నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సంవత్సరం పాటు ఈ దంపతుల బంధం సవ్యంగానే సాగినప్పటికీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడివిడిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం సోషల్‌మీడియా ఖాతాల నుంచి తాము కలిసి దిగిన ఫోటోలను వీరిరువురూ తొలగించడం అందరికీ తెలిసిన కధే. దీంతో ఈ జంట విడిపోతోందంటూ జారుగా ప్రచారం జరిగింది. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక ఇటీవలే ‘డెడ్‌ పిక్సెల్స్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది.