వైసీపీ అత్యుత్సాహం ఫలించిందా? ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిపై కోర్ట్ తీర్పు ఇదే!

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ఇంటిని గురించి వార్తలు గత నాలుగున్నర సంవత్సరాలుగా మనం చూస్తూ వున్నాం. ఈ ఇంటి జప్తుకు సంబంధించి ఏసీబీ కోర్ట్ శుక్రవారం సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసినదే. కరకట్ట నివాసం జప్తునకు ఏపీ సీఐడీకి అనుమతిస్తూ లింగమనేని రమేష్‌తో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించడం జరిగింది. గత నెల 14న కరకట్టపై చంద్రబాబు నాయుడు గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది కూడా. క్రిమినల్ లా అమెండమెంట్ 1994 చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది.

ఈ నేపథ్యంలో చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని కూడా ఆరోపించడం జరిగింది. సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోరడ్ అలైన్‌మెంట్లలో అవతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఏపీ సీఐడీ విచారణ ఇంకా జరగడం కొసమెరుపు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, నారాయణలు వారి పదవులను దుర్వినియోగం చేసినట్టుగా ఏపీ సీఐడీ చెబుతోంది. అధికారం ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. వ్యాపారవేత్త లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని ఆరోపించింది.

ఇకపోతే కరకట్ట నివాసం జప్తు పిటిషన్ పై ఎప్పటికప్పుడు తీర్పు వాయిదా పడుతూ వస్తోంది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న లింగమనేనికి నోటీసులు ఇవ్వాలని అనేకమార్లు ఏసీబీ ట్రై చేసింది. ఈ కేసుకి సంబంధించిన అన్ని వివరాలను తమ ముందు ఉంచాలన్న ఏసీబీ కోర్టు.. విచారణల మీద విచారణలు చేస్తూ ఇన్నాళ్లు వచ్చింది. ఈ కేసు విసు విషయంలో ఏపీ ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వస్తున్న సంగతి అందరికీ విదితమే. విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణానదీ కరకట్టపై నివాసం ఉంటున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీ చేసిన ప్రయత్నాలు చాలాసార్లు ఫలించలేదు. అయితే ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించినట్టయింది.

అయితే ఈ విషయాన్ని వైసీపీ మరలా రాజకీయం చేయాలని చూస్తోంది. ఈ పూర్తి వ్యవహారంలో చంద్రబాబుని విలన్ చేయాలని చూసిన వైసీపీ ప్లాన్ ఫలించలేదనే చెప్పాలి. గతంలో ఉండవల్లి కరకట్ట వద్ద గల లింగమనేని ఇంటిని జఫ్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు అనేకమార్లు స్పష్టం చేసింది. అటాచ్‌మెంట్ కు అనుమతివ్వాలంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని జఫ్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారించవలసి ఉంటుందని న్యాయమూర్తి చెప్పేవారు. దాంతో ఈ వ్యవహారం అనేకమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే నేటికీ ఈ విషయంపైన ఓ క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చు.