Post Office : పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు కొత్త రూల్స్..!!

Post Office : పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే పోస్ట్ ఆఫీస్ సేవలను వినియోగించుకోడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. డబ్బులను ఆదా చేసుకోవడానికి ఎక్కువమంది పోస్ట్ ఆఫీస్ లను ఆశ్రయిస్తున్నారు. ఇక పోస్టాఫీసులు కూడా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ .. వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే కొన్ని లక్షలమంది ప్రజలు పోస్టాఫీసు సేవలను పొందుతున్నారు. తాజాగా వెలువడిన సమాచారం ఏమిటంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉన్నవారికి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.

అయితే ఆ రూల్ ఏమిటి..? కస్టమర్లు ఏం తెలుసుకోవాలి..? ఏం చేయాలి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..మీరు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా కలిగి ఉన్నారా..? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ..టైం డిపాజిట్ అకౌంట్.. మంత్లీ ఇన్కమ్ స్కీం లాంటి స్కీం లలో చేరి ఉన్నారా..? అయితే మీలాంటి వారికి అలర్ట్ అని చెప్పవచ్చు. ఇండియా పోస్ట్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ ను అమలు చేయనుంది.. మీరు పొందుతున్న వడ్డీ.. ప్రతి నెలా లేదా మూడు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చే వడ్డీని నగదు రూపంలో ఇకపై ఇండియా పోస్ట్ ఇవ్వదు అని సమాచారం. ఇకపై మీ వడ్డీని సేవింగ్స్ అకౌంట్ లో జమ చేయనున్నట్లు సమాచారం. నేరుగా సేవింగ్స్ అకౌంట్ నుంచి తమకు వచ్చిన వడ్డీని విత్డ్రా చేసుకోవచ్చు.

New Rules for Post Office Clients
New Rules for Post Office Clients

కొత్త రూల్స్ 2022 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ..టైం డిపాజిట్ అకౌంట్.. మంత్లీ ఇన్కమ్ స్కీం ఇలాంటి పథకాలలో చేరిన వారు ఏప్రిల్ 1 2022 నుంచి ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ ని నేరుగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తామని ఇండియా పోస్ట్ ఆదేశాలను విడుదల చేయడం జరిగింది. మీరు కనుక ఈ స్కీం లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఇకపై మీకు రావాల్సిన వాటిని మీరు నేరుగా చెక్కు ద్వారా తీసుకోవచ్చు. ఇక నగదు రూపంలో మీకు పోస్ట్ ఆఫీస్ నుంచి ఎటువంటి వడ్డీ అయితే రాదు. వడ్డీ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు.. నేరుగా మీ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. ఈ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇదోక శుభవార్త అని చెప్పవచ్చు.