Financial Problems : ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టే కుంకుమ.. ఎలా అంటే..?

Financial Problems : హిందూ సాంప్రదాయం ప్రకారం భారతీయులు ఎంతో పవిత్రంగా పూజించే వాటిలో పసుపు, కుంకుమ కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. వివాహితులైన స్త్రీలు కుంకుమ ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా భర్త యొక్క యోగక్షేమాలు ఈ కుంకుమ లోనే ఉన్నాయని.. వారు ఎంతో భక్తితో పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారు నుదుటిన కుంకుమ పెట్టుకుంటే భర్త యొక్క ఆయుష్షు పెరుగుతుంది అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కుంకుమతో ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతోంది మరి ఎలాగో ఒకసారి ఇప్పుడు చూసి తెలుసుకుందాం..

పూజ చేయడానికి కుంకుమ చాలా అవసరం. ఇలా ఎవరైనా సరే నిత్యం సమస్యలతో బాధపడుతుంటే హనుమంతుడికి ఐదు మంగళవారాలు అలాగే ఐదు శనివారాలు మల్లెపూల నూనె .. కుంకుమను సమర్పించాలి. అలాగే బెల్లం.. బెల్లంతో తయారుచేసిన అన్నాన్ని నైవేద్యంగా పంచాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.. వాస్తు దోషం వున్నట్లు అయితే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గడపకు ప్రతిరోజు ఉదయం కుంకుమ బొట్లు పెట్టాలి . అదేవిధంగా గుమ్మానికి ఎదురుగా గణేశుని విగ్రహం ఉంచాలి . ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం , శాంతి కూడా కలుగుతుంది.

Saffron to check for financial problems
Saffron to check for financial problems

ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఒక కొబ్బరికాయను తీసుకుని కుంకుమ రాసి ఎరుపు రంగు బట్టలో కట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ దేవిని పూజించాలి.ఆ కొబ్బరికాయను ఒక ప్రదేశంలో లేదా బీరువా లో ఉంచుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక అంతే కాదు మీరు ఏదైనా ఇంటర్వ్యూలో విజయం పొందాలి అంటే గురు పుష్య యోగం లేదా శుక్ల పార్టీ పుష్య యోగం లో గణపతి ఆలయాన్ని సందర్శించాలి. దాతృత్వానికి కుంకుమ దానం చేయాలి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఇది పెంచడానికి తోడ్పడుతుంది. ఇలా చేయడం వల్ల మీరు చేసే పనిలో విజయం సాధించడంతో పాటు ఇంటర్వ్యూలో కూడా విజయాన్ని పొందుతారు.