Niharika : గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు. అయితే ఈ కేసులో నిందితుడుగా ఉన్న హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక రెడ్డి అసలు నిజ స్వరూపం బయటపెట్టారు పోలీసులు. అయితే తనను ఈ కేసులో ఇరికిస్తే ముందుగానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందట నీహారిక. దీంతో పోలీసులు ఆమెను విచారించిన అసలు నోరే మొదప లేదు. ఇక తల్లిదండ్రులు కూడా తన కూతురిని వదిలేయాలని వేడుకోవడం తో నిహారిక కుటుంబాన్ని చూసి కొంతమంది అధికారులే జాలి పడి వదిలేశారట.
కానీ నిహారిక మాత్రం చిన్న వయసులోనే కరుడుగట్టిన నేరస్తురాలుగా తన వయసుకు మించి సమాధానాలు తెలియజేస్తోంది. దీంతో పోలీసులు ఏమి చేసేదిలేక అసలు విషయాన్ని నేరస్తుడైన హరి హర కృష్ణ నుంచి రాబట్టారు. అయితే నవీన్ హత్య తర్వాత ఇతనికి కూడా భాగం ఉందని అరెస్టు చేయడం జరిగింది. నిహారిక హరికృష్ణ కూడా ఇద్దరూ కలిసి ఎన్నో స్టోరీలు చెప్పారు. ఇక వీరిద్దరూ హీరోలనే మించిపోయి నటించారని తెలుస్తోంది. డీసీపీ సాయి చెప్పిన సంచలన నిజాలు ఇలా ఉన్నాయి.
కోర్టు నుంచి నోటీసులు అందుకున్నాక హరిహర కృష్ణ చాలా ధీమాగా సమాధానాలు చెప్పే వారట. ఇక బ్రేక్ ఫాస్ట్ , లంచ్ అంటూ నానా హంగామా చేసేవారట. ఇక మూడవరోజు విచారణ సమయంలో హరి హర కృష్ణ భానిహారిక కోసమే నవీన్ ను చంపానని బాంబు పేల్చారు. కేవలం ఆమె కోసమే చంపానని హరికృష్ణ తెలిపారు. నిహారిక రెడ్డి హస్తం కూడా ఇందులో భాగము ఉందని తెలియజేశారు హరికృష్ణ. హరికృష్ణ ను తప్పించేందుకు నిహారిక డబ్బులు కూడా ఇచ్చి పారిపొమ్మని చెప్పిందట. ఫిబ్రవరి 17 2023న పక్క ప్లాన్ తో నవీన్ ను హత్య చేశారు హరిహర కృష్ణ. ఇక నవీన్ గుండె మర్మాంగాలు చేతివేళ్లు లివర్ తీసి హరిహర కృష్ణ నిహారిక కు ఫోటోలను షేర్ చేశారట.
ఇక ఫోటోల కింద నీచంగా కామెంట్లు చేసి పంపారట. ఆమె మాత్రం కేవలం గుడ్ బాయ్ అంటూ హరికృష్ణ కు మెసేజ్ పంపింది. ఇక తన స్నేహితుడు హాసన్ సహాయంతో హరికృష్ణ ఈ భాగాలను పారివేయడం జరిగింది . ఆ తర్వాత ఈ విషయాన్ని నిహారిక కి తెలియజేశారు హరికృష్ణ. హరికృష్ణ స్నేహితుడు హాసన్, నిహారిక కలిసి తప్పించుకోవడానికి ప్లాన్ చేశారు. కానీ మరుసటి రోజు నవీన్ తల్లిదండ్రులు హరిహర కృష్ణకు ఫోన్ చేయడం.. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ నిజాలన్నీ బయటకు వచ్చాయి