AP Sarkar: ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 31వ తేదీ లోగ బకాయిలను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ ,ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నేతలు హాజరు కావడం జరిగింది.
ఈ భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలతో పెండింగ్ ఉన్న సమస్యల పైన చర్చించామని ఉద్యోగులంతా ప్రభుత్వంలో ఒక భాగం అని సంక్షేమం కోసమే ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. సుమారుగా రూ.3 వేలకోట్ల మేర చెల్లింపు ఈనెల ఆఖరిలోగా చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలకు సంబంధించి బకాయిలు చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు సజ్జల తెలియజేయడం జరిగింది.
మంత్రి ఆది మూలపు సురేష్ మాట్లాడుతూ ఉద్యోగులకు చెందిన పెండింగ్ క్లెయిమ్స్ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామని ఉద్యోగుల జిపిఎఫ్ బకాయిలు ఈనెల 31న చెల్లిస్తామని అందరూ ఉద్యోగులకు సంబంధించి చెల్లిస్తామని రిటైర్మెంట్ మెడికల్ ఏరియన్స్ అన్ని 31 నాటికి క్లియర్ చేస్తామని తెలిపారు.