Niharika Case : నవీన్ కేస్ లో కీలక విషయాలు బయట పెట్టిన తన మేనమామ..

Niharika Case : బీటెక్ విద్యార్థి నవీన్ వధ కేసులో మిస్టరీ విడిపోయింది. నవీన్ ను చంపిన తరువాత నిందితుడు హరి హరికృష్ణ నాలుగు సార్లు నిహారిక రెడ్డిని కలిసినట్లు ఒప్పుకుంది. అతని మృతదేహం ఉన్న ప్రదేశానికి కూడా వెళ్లడమే కాకుండా.. అతని మాటలు నమ్మి ఆ విషయాన్ని దాచినట్లు కూడా వాంగ్మూలం ఇచ్చింది. కాగా ఈ కేసులో నవీన్ మేనమామ నిహారిక పై విస్తుగొలుపే నిజాలను బయటపెట్టారు. ఆమె పైన కూడా తగిన యాక్షన్ తీసుకోవాలని మీడియా ముఖంగా కోరారు.

Naveen case on Niharika harihara
Naveen case on Niharika harihara

నిహారిక కోసమే అతడు నవీన్ ను చంపారని హరిహరాను అరెస్టులు చేశారని .. అతనితో పాటు నిహారికను కూడా అరెస్టు చేయాలని నవీన్ మేనమామ కోరారు. అంతేకాకుండా మూడు నెలల ముందు నుంచే ఈ ప్లాన్ చేశారని.. ఎక్కడ ఏ ఆధారం, క్లూ దొరకకుండా ఉండేందుకు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని.. వాళ్లపైన కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిహారిక లాంటి మరొక అమ్మాయి తయారవ్వకుండా ఉండాలి అంటే ఆమెని ఉరితీయాలని నవీన్ మేనమామ కోరారు.

ఒకవేళ నవీన్ ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నిహారిక పోలీసులకు కంప్లైంట్ చేసి ఉండేదని ..అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టే ఆమె తన కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయాన్ని చెప్పలేదని.. ఒకవేళ నవీన్ తో ఇబ్బంది ఉండి ఉంటే తను కనీసం ఇంట్లో వారితోనైనా ఈ విషయం చెప్పేదని.. ఇక్కడే క్లియర్ గా ఉన్న విషయం తెలిసిపోతుందని నవీన్ మేనమామ వివరించారు. అందుకే ఆమెను కూడా శిక్షించాలని న్యాయవ్యవస్థను డిమాండ్ చేస్తున్నారు.

హరిహరను ఏ విధంగా అయితే శిక్షిస్తారు అదే విధంగా నీహారికని కూడా శిక్షించాలని మాకులాగా మరొకరు బాగా పడకుండా ఉంటారని.. ఈ విషయంలో మాకు న్యాయం జరిగేలా చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నవీన్ మేనమామ. కచ్చితంగా ఈ విషయంలో అమ్మాయి ప్రమేయం ఉంది. హరిహర నిహారిక ఇద్దరు క్లాస్మేట్స్ అతనికి మా నవీన్ కి ఎలాంటి సంబంధం లేదు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఈ విషయం తెలిసింది అని ఆయన అన్నారు.