Avinash Reddy : అవినాష్ రెడ్డి భయం పట్టుకుందా.? అందుకేనా.. ఇది.?

Avinash Reddy : రాజకీయాల్లో ట్రెండింగ్ టాపిక్ వైయస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్.. సీబీఐ రేపు వైయస్ అవినాష్ రెడ్డిని విచారించనున్నా నేపథ్యంలో వైయస్ అవినాష్ రెడ్డి తీసుకున్న స్టెప్ కి అందరూ ఆశ్చర్య పోతున్నారు.. కొంతమంది అవినాష్ రెడ్డి కి భయం మొదలైంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని.. మరికొంతమంది ఆయన జాగ్రత్త పడుతున్నాడని అంటున్నారు..

Avinash Reddy :Ys Viveka case on ys Avinash Reddy petition on highcourt 
Avinash Reddy :Ys Viveka case on ys Avinash Reddy petition on highcourt 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ప్రాణాలు తీసిన కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. సీబీఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ హైకోర్టులో అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో అవినాష్ రెడ్డి టాపిక్ ఒక్కసారిగా సెన్సేషన్ గా మారింది.

160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి విచారణ మొత్తం వీడియో తీసేలా ఆదేశాలివ్వాలని తన పిటిషన్‌లో కోరారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయకూడదని అవినాష్ రెడ్డి కోరుతున్నారు.

శుక్రవారం అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆయనను సీబీఐ మూడో సారి విచారణకు పిలిచింది. ఈ సారి అరెస్ట్ చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తి రేపుతోంది.కొంతమంది అవినాష్ రెడ్డి కి భయం మొదలైంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని.. మరికొంతమంది ఆయన జాగ్రత్త పడుతున్నాడని అంటున్నారు.. ఇక ఈ కేస్ ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి..