Non important Votes : జగనన్న అడ్డా ఇది.. ఆ మాత్రం ఫేక్ ఓట్లు ఉండే ఇలా విమర్శించాలా సిపిఐ నారాయణ.?

Non important Votes :ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు . అధికారిక పార్టీ వారు దానిని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు సిపిఐ నారాయణ. ఒక మహిళకు ఏకంగా 11 ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా నిరూపించారు సిపిఐ నారాయణ. ఈ వార్త విని కొంతమంది కంగుతిన్నారు. మరి కొంతమంది ముక్కున వేలేసుకుంటున్నారు..

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీతో పాటు విపక్షాలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇందులో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపోటములు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని.. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను కాస్త సీరియస్ గా తీసుకున్నాయి. దాంతో వైసీపీ దొంగఓట్లు నమోదు చేయించి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని సీపీఐ జాతీయనేత నారాయణ మండిపడ్డారు.

తిరుపతిలో వైసీపీ నేతలు దొంగఓట్లు నమోదు చేయించినట్లు ఆరోపణలు వచ్చిన ఇళ్లను తాజాగా సీపీఐ నారాయణ సందర్శించారు. అక్కడ ఓట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలని విన్నాం కానీ.. జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేబీ లేఅవుట్‌లోని ఓ మహిళకు 18 మంది భర్తలున్నట్లు నమోదు చేయడం సిగ్గు చేటని నారాయణ విమర్శించారు. దొంగ ఓట్ల కోసం వైసీపీ నేతలు ఇలా చూపడం సిగ్గుచేటన్నారు.

తిరుపతిలోని ఓ ఇంట్లో 30, మరో నివాసంలో 11 ఓట్లు నమోదు చేసుండటాన్ని నారాయణ గుర్తించారు. యశోదనగర్‌ 18-1-90/12జి ఖాళీ ప్రదేశంలో పది దొంగ ఓట్లున్నట్లు గుర్తించారు. ఒకటో క్రాస్‌ వలంటీర్‌ ఇంట్లో 12 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. సీపీఎం ఆఫీసు పక్కన లక్ష్మి ఇంట్లో ఎనిమిది దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓటమి భయంతోనే ఏ చదువూ లేనివారికీ వైసీపీ ప్రభుత్వం గ్రాడ్యుయేట్‌ ఓటు అర్హత కల్పించడం దారుణమని నారాయణ విమర్శించారు.