ఉపాసనకి బిడ్డ పుట్టిందని తెలిసి ఆసుపత్రికి వచ్చిన నమ్రత.. ఆపై ఆమె చేసిన పనికి చెర్రీ షాక్..!

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు రీసెంట్‌గా ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ సెలబ్రిటీ జంట తమ బిడ్డను మీడియా ముందుకు తీసుకొచ్చి చూపించారు కూడా. అత్యంత శుభప్రదమైన గడియల్లో పుట్టిన ఈ చిన్నారి మెగా కుటుంబాల్లో ఆనందాలు నింపింది. మెగా అభిమానులు కూడా రామ్ చరణ్ వారసుడు లేదా వారసురాలి కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక కూడా ఈ చిన్నారి పుట్టుకతో తీరిపోయిందనే చెప్పాలి.

అయితే రామ్ చరణ్ సతీమణి హైదరాబాద్ నగరంలోని అపోలో హాస్పిటల్ లో ఒక అమ్మాయికి జన్మనిచ్చిందని తెలిసి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అక్కడికి వెళ్లారట. అంతేకాదు ఉపాసనాకి చాలా ఆప్యాయంగా కంగ్రాట్యులేషన్స్ తెలిపినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. నిజానికి మహేష్ బాబు, రామ్ చరణ్ మధ్య పెద్దగా ఫ్రెండ్‌షిప్ లేదు కానీ నమ్రత, ఉపాసన మధ్య మాత్రం చాలా మంచి స్నేహం ఉందట. మహేష్ బాబు చిన్న పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తారనే సంగతి తెలిసిందే.

ఇలా మంచి చేసేవారు అంటే ఉపాసనకి చాలా ఇష్టం. అందుకే ఆమె మహేష్ ఫ్యామిలీపై ప్రేమ కురిపిస్తుంటారు. ఇక నమ్రత ఉపాసన మంచి మనసు గురించి తెలుసుకొని ఆమెతో స్నేహం చేయడం మొదలుపెట్టిందట. ఆ స్నేహంతోనే బిడ్డ పుట్టిన సందర్భంలో ఆసుపత్రికి వచ్చి ఉపాసనని కలిసి జాగ్రత్తలు చెప్పిందట. అయితే నమ్రత ఆసుపత్రికి వస్తుందని ఊహించని రామ్ చరణ్ షాక్ అయ్యాడట. తరువాత ఆమె మంచి మనసుని పొగిడాడట. మొత్తం మీద వీరి స్నేహం ఈ ఘటనతో వెలుగులోకి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే నమ్రత ఆసుపత్రికి వెళ్లినట్లు అధికారిక ఫోటోలు గానీ వీడియోలు గానీ బయటికి రాకపోవడం గమనార్హం.