టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులం ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళితో కలిసి మహేష్ బాబు ఒక హై ఇంటెన్స్ అడ్వెంచర్ ఫిలిం చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక క్రేజీ న్యూస్ సినిమా సర్కిల్లో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ హ్యాండ్సమ్ హీరో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడట.
ఈ ఇద్దరు దిగ్గజ నటులు ఒక మూవీ కోసం కలుస్తున్నారని తెలిసి అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ మల్టీస్టారర్ మూవీ టాలీవుడ్, కోలీవుడ్‌ల ఫ్యాన్స్‌ని అలరించేలా చాలా గొప్పగా తీస్తారని సమాచారం. తమ కెరీర్‌లో స్టార్‌డమ్ అర్ధాన్ని పునర్నిర్వచించిన ఈ ఇద్దరు ఆన్‌స్క్రీన్ కొలాబరేషన్‌తో అదరగొట్టనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీ స్టోరీ ఏంటనేది ఇంకా తెలియ రాలేదు కానీ ఇందులో యాక్షన్, డ్రామా, కామెడీ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని సమాచారం. ఇది ప్రేక్షకుల విభిన్న అభిరుచులకు అనుగుణంగా ఉంటుందని సినీ పరిశ్రమలోని టాక్ నడుస్తోంది. మహేష్ బాబు కూల్ యాక్టింగ్, రజనీకాంత్ స్టైల్ తో ఈ చిత్రం మరపురాని సినిమాగా నిలిచిపోతుందని కూడా అంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు, రజనీకాంత్ తండ్రి కొడుకుల పాత్రలు చేశారు. కాగా మహేష్ బాబు, రజనీకాంత్ కూడా అలానే తండ్రి కొడుకుల పాత్రలు చేస్తారా లేదంటే సపరేట్ హీరోస్ గా నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ మూవీ 500 కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తున్నారని సమాచారం.