ఏపీ సీఎం జగన్ కూతురు తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం ట్రైలర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పెద్ద కూతురు హర్ష రెడ్డి గురించి చాలామందికి తెలుసే ఉంటుంది. ఆమె ప్యారిస్ లోని ఒక బిజినెస్ స్కూల్లో మంచి మార్కులతో ఎంబీఏ పూర్తి చేశారు. కేవలం చదువుల పైనే దృష్టి పెట్టిన హర్ష సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అసలు ఆమె సోషల్ మీడియాలో కనిపించిన దాఖలాలే లేవు. కానీ తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం యాక్షన్ ట్రైలర్ చూసి ఆమె తొలిసారిగా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి యాక్షన్ ట్రైలర్ ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం మహేష్ బాబు లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, ఫైట్స్ హర్షా రెడ్డికి చాలా ఇష్టమట. మహేష్ సినిమాలు ఆమె వీలు చూసుకుని చూస్తారట. అయితే ఇటీవల గుంటూరు కారం ట్రైలర్ విడుదల కాగా దాన్ని చూసి ఆమె ఫిదా అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ ని చాలా రోజుల తర్వాత ఊర మాస్ అవతారంలో చూసి ఆమె ముగ్ధులైనట్టు సమాచారం.
ఇక మహేష్ బాబు కి అమ్మాయిలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సర్కారు వారి పాటతో అలరించిన ఈ టాలీవుడ్ ప్రిన్స్ ఇప్పుడు గుంటూరు కారం తోని ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ వచ్చేయడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఇందులో శ్రీ లీల ఆల్రెడీ హీరోయిన్ గా సెలెక్ట్ కాగా సంయుక్త మీనన్ సెకండ్ హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వస్తున్నాయి.