MP Bharath : ప్రత్యేక హోదాపై మోడీని నిలదీసిన ఎంపి భరత్..

MP Bharath : రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్న ఈ బడ్జెట్ లో ను ప్రత్యేక హోదా ప్రస్తావనలేదని వైఎస్ఆర్సిపి ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సంబంధించిన వరకు నిరాశ ఏరవుతుంది అన్నారు. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ లోక్సభలో ప్రత్యేక హోదాపై మోడీని నిలదీశారు. ప్రస్తుతం ఆ స్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mp Bharath Ram asking Ap special status in parliament
Mp Bharath Ram asking Ap special status in parliament

ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే.. కేంద్రం మూడింటికి నిధులు ఇస్తామని చెప్పిందని తెలిపారు. అన్నీ కాలేజీలకు నిధులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

రైల్వే పరంగా విశాఖపట్నం విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి ఉందన్నారు. కొవ్వూరు భద్రాచలం లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉందని.. ఈ లైను వల్ల హైదరాబాద్ సికింద్రాబాద్ లకు 70 కిలోమీటర్ల దూరం తగ్గి ప్రయాణాలకు భారం తగ్గుతుందన్నారు
. విశాఖపట్నం చెన్నై, చెన్నై బెంగళూరు , హైదరాబాద్ కారిడార్లకు నిధులు ఇస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు..

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ను హైదరాబాద్ కు ఇచ్చారని రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని తెలిపారు.. రామాయపట్నం పోర్టుకు కూడా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు యూ టర్న్ తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు .