Home Loan : మన జీవితంలో మనం తీసుకునే అతి పెద్ద లోన్ హోమ్ లోన్.. ఎందుకంటే టెన్యూర్ ఎక్కువగా ఉంటుంది.. 10 సంవత్సరాలు.. 20 సంవత్సరాలు అలా ఉంటుంది. మనం ఈ హోం లోను అది తెలివిగా అతి త్వరగా క్లియర్ చేసుకో లేకపోతే.. జీవితాంతం మీ లోను కట్టవలసి ఉంటుంది..
ఉదాహరణకు మనం 50 లక్షల గృహ లోన్ తీసుకున్నట్లయితే.. ఆ లోని చెల్లించడానికి 20 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకుంటే.. 240 నెలలు ఈఎంఐ చెల్లించాలి. సుమారుగా 8% రేట్ అఫ్ ఇంట్రెస్ట్ ఎంచుకుంటే ప్రతి నెల 41,822 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో అసలు వడ్డీ మొత్తం కలిపి మనం కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మనం ఎక్కువ సంవత్సరాలు చెల్లించడానికి ఈఎంఐ పెట్టుకుంటే.. ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
240 నెలలు 41,822 ఈఎంఐ మనం చెల్లించాలి అనుకుంటే మొదటి సంవత్సరం.. అంటే 12 నెలలు ఈ ఈఎంఐ యధావిధిగా కట్టండి.. ఈ సంవత్సరం మీకు ఒక 2500 మీ నెల జీతం పెరిగింది అనుకోండి.. ఆ పెరిగిన జీతం 44,331 గా ఈఎంఐ కట్టండి.. ఇలా మరుసటి సంవత్సరం కూడా కట్టండి ఆ తరువాత సంవత్సరం కూడా.. మరో 2500 జీతం పెరిగితే.. 46,991 మరొక సంవతసరం అలాగే కట్టండి. ఇలా ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వెళితే.. ఇలా కడితే 240 నెలలు కట్టాల్సిన ఈఎంఐ 140 నెలలకు వస్తుంది. అంటే 20 సంవత్సరాలు కట్టాల్సింది.. 11 సంవత్సరాలు లో మాత్రమే కడతాము. ఈ విధానాన్ని ఫాలో అవ్వడం వల్ల 19 మనం ఆదా చేసుకోవచ్చు..
ప్రిపేమెంట్ కింద 1లక్ష రూపాయలను లేదా మీ దగ్గర ఉన్నంత డబ్బులను కట్టేస్తే నాలుగు పర్సంటేజ్ కింద తగ్గించుకొని కట్టించుకుంటారు. ఇలా కనుక కడితే మీ అమ్మాయి చాలా త్వరగా తీరుతుంది.
లేదంటే ప్రతి సంవత్సరం మీరు కట్టే ఈఎంఐ కి.. అంటే 12 ఈఎంఐ ఒక సంవత్సరానికి కడతారు అని అనుకుంటే ఒక సంవత్సరానికి 13 ఈ ఈఎంఐ కట్టండి. ఇలా కట్టినా కూడా హోమ్ లోన్ త్వరగా తీరుతుంది ఎక్కువ డబ్బు వడ్డీకి కట్టకుండా ఆదా చేసుకోవచ్చు.