Miss Universe: మిస్ యూనివర్స్ 2022గా అమెరికాకు చెందిన ఆర్ బొన్నీ గాబ్రియెల్ నిలిచింది. 86 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలలు పోటీపడగా.. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఆర్ బొన్నీ గాబ్రియెల్ సొంతం చేసుకుంది.. మిస్ వెనిజులా అమండా డుడమెల్ రన్నరప్ గా నిలవగా.. డొమినికా రిపబ్లికన్ బ్యూటీ ఆండ్రినా మార్టినెజ్ మూడో స్థానంలో నిలిచింది.
2022 మిస్ యూనివర్స్ పోటీలు అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లోగల మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. తన అందంతో పాటు ప్రతిభను కనబరిచిన 71వ విశ్వ సుందరి పోటీల్లో విజేతగా అమెరికా అందం బొన్నీ గాబ్రియెల్ నిలిచింది. 28 సంవత్సారాల మోడల్, ఫ్యాషన్ డిజైనర్, పర్యావరణానికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించే బొన్నీ గాబ్రియెల్ తన కలను సాకారం చేసుకుంది. మాజీ మిస్ యూనివర్స్, పంజాబ్ సుందరి హర్నాజ్ సంధు విశ్వ సుందరికి కిరీటాన్ని సొంతం చేసుకుంది. బోనీ గ్యాబ్రియెల్ చాలా టాలెంటెడ్. హైస్కూల్ చదివే రోజుల్లోనే ఫ్యాబ్రిక్, టెక్స్‌టైల్స్, డిజైనింగ్‌పై ఆసక్తి చూపింది. నార్త్ టెక్సాస్ యూనివర్శిటీ నుంచి ఫ్యాషన్ డిజైన్‌లో 2018 సంవత్సరంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది.