Varasudu: కోలివుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం వారసుడు తెలుగులో నిన్న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల నడుమ వారసుడు విడుదల అయింది. అయినా కానీ తెలుగు డీసెంట్ ఓపెనింగ్సే తెచ్చుకుంది.. వారసుడు సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి.!?

నైజాం: 1.40Cr
సీడెడ్: 45L
యూఏ: 40L
ఈస్ట్: 18L
వెస్ట్: 17L
గుంటూరు: 18
కృష్ణ: 19L
నెల్లూరు: 13L
ఏపీ, తెలంగాణ రెండు రాష్టలు కలిపి: 3.10CR (5.80CR గ్రాస్)
విజయ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 3గా వారసుడు ఉంది. మాస్టర్ 6.01 కోట్లు, బీస్ట్ 4.81 కోట్లు కాగా.. వారసుడు 3.10 కోట్లతో ఉంది.
తమిళంలో వారిసు జనవరి 11న విడుదలైంది. మూడు రోజుల్లో దళపతి విజయ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు నాలుగో రోజు రూ.20 కోట్లు రాబట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను దాటింది. 2023లో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. దిల్ రాజ్ ఈ సినిమా కలెక్షన్స్ చూసి షాక్ అయ్యారట. మొత్తానికి ఈ సినిమా అప్పుడే ఓ రికార్డ్ చేసింది.