Meter: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన శైలిలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు కిరణ్ అబ్బవరం . ఇటీవలే వినరో భాగ్యము విష్ణు కథా సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈయన ఈ సినిమాను ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు మీటర్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రమేష్ కాడూరి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ క్లబ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న మీటర్ సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలవ్వగా టీజర్ ద్వారా ఈ సినిమాలో కిరణ్ ఎస్ఐ పాత్రలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఎస్సైగా ఉంటూనే రౌడీల ఆట కట్టించే క్యారెక్టర్ లో కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నాడు. ఈయన దగ్గర పనిచేసే పోలీస్ అధికారులుగా పోసాని , సప్తగిరి నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం.. టీజర్ తోనే సక్సెస్ కొట్టినట్టు కనిపిస్తోంది మరి సినిమాతో ఏ విధంగా సక్సెస్ అవుతారో చూడాలి.