Murali Raju.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనమామ అయిన నిర్మాత మురళి రాజు మంగళవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్ మధుర నగర్ లో స్వర్గస్తులయ్యారు. బాలీవుడ్ భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన తెలుగు నిర్మాత మధు మంతెన తండ్రి, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మేనమామ నిర్మాత మురళి రాజు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం పట్టణానికి చెందినవారు గతంలో సినీ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించినాయన సినిమా నిర్మాణమే కాకుండా పలు వ్యాపారాలు కూడా కొనసాగించారు
.
నిర్మాత మధుమంతెన అందరికీ పరిచయమే. తెలుగులో గజిని, రక్త చరిత్ర 1, 2 చిత్రాలను నిర్మించిన మధుమంతెన బాలీవుడ్ ఇతర భాషలలో సుమారు 34 పైగా చిత్రాలు నిర్మించారు. మురళి రాజు మరణ వార్త విని ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్, గీత ఆర్ట్స్ మేనేజర్ బన్నీ వాసు, అమీర్ ఖాన్ తదితరులు మధురానగర్ మురళి రాజు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.