SSMB 28: మహేష్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమాకే హైలెట్ కానున్న పాత్ర..!

SSMB 28: తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న SSMB 28 మూవీ నుంచి ఒక క్యారెక్టర్ ను చిత్రం మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో చాలామంది బడా స్టార్లు కూడా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించినట్లు ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు చెందిన కొందరు నటీనటులను కూడా సెలెక్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలోని ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్ర.. మహేష్ బాబు చెల్లి పాత్ర కోసం టాలీవుడ్ లోని ఒక యంగ్ హీరోయిన్ తీసుకున్నారని తెలుస్తోంది..

Mahesh Babu's SSMB 28: From Star cast to trivia – 5 things to know about  the project | PINKVILLA

అయితే ఈ చెల్లి పాత్ర సినిమాకి హైలెట్ కాబోతోందట. వీరిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు సినిమాకు పిల్లర్ గా నిలవబోతున్నాయని సమాచారం. అయితే ఆ పాత్ర చేసే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా బయటకు రివీల్ చేయలేదు. ఇకపోతే ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే , శ్రీ లీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.