గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘కోకాపేట’ భూములు వేలంపాట గురించే చర్చ నడుస్తోంది. అక్కడ దాదాపు ఒక్కో ఎకరం 100 కోట్లకు అమ్ముడు పోతుండటం ఇపుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఆక్షన్ జరుగుతుందని ఊహించలేదు. ఒక్కో ఎకరం 35 కోట్లు ధరతో వేలంపాట నిర్వహిస్తే ఊహించని రేంజ్ లో ధర పెరిగి బయ్యర్లకు సైతం షాక్ ఇస్తోంది. హ్యాపీ రైట్స్ నియోపోలిస్, రాజ్‌పుష్ప ప్రాపర్టీస్ 3.6 ఎకరాలను రూ.362 కోట్లకు కొనుగోలు చేశాయి. ఈ పక్రియలో చిరంజీవికి ఎలాంటి ప్రమేయం ఏమి లేదు. ఈ క్రమంలో చిరంజీవికి దాదాపు 2000 కోట్ల దాకా ఆస్తులు పెరిగినట్లు తెలుస్తుంది.
ఇప్పుడు అదే విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. రీసెంట్ గా రామ్ చరణ్ కి ఉపాసన కు 11 ఏళ్ల తర్వాత పండంటి పాప జన్మించిన సంగతి విదితమే. ఆమెకు క్లీంకార అనే నామకరణం కూడా చేశారు. మనవరాలు రాకతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అప్పట్లో చిరంజీవి సంతోషం వ్యక్తం చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అవే మాటలు నిజమయ్యాయి మరి. చిరంజీవికి దాదాపు కోకాపేట లో దాదాపు 20 ఎకరాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆచార్య సినిమాకు సంబంధించిన సెట్స్ కూడా అక్కడే వేసి షూట్ చేశారు. ఈ ప్లేస్ లోనే మెగా స్టూడియో కట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.
కాగా ఇప్పుడు ఈ భూముల విలువ దాదాపు 2000 కోట్లకు చేరినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. దాదాపు దశాబ్దం క్రితం అతి తక్కువ ధరకే ఆ భూములను చిరంజీవి కొన్నట్లు రికార్డ్స్ వున్నాయి. ఇప్పుడు అవి వేల కోట్లకు పెరగడం చూస్తుంటే చిరంజీవి ముందుచూపుకు ఒక ఉదాహరణ అంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కి కూడా దాదాపు 5 ఎకరాల స్థలం అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భారీ స్థాయిలో ఇంటి నిర్మాణం చేయాలనీ ప్రభాస్ ఆలోచనలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. దాదాపు 200 కోట్ల ఖర్చుతో ఆ ఇంటిని నిర్మించటానికి సిద్దమై అందుకు తగ్గ పనులు కూడా ఒక ఇంటర్నేషనల్ సంస్థ కు అప్పగించినట్లు తెలుస్తుంది.
ఈ విధంగా చూస్తే ప్రభాస్ కు కూడా కోకాపేట లో వందల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని ఇట్టే తెలిసిపోతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా విశేషాలకొస్తే భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై చిరు అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. మరోవైపు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది.