బాలయ్య పాటకి డాన్స్ ఇరగదీసిన మహేష్ బాబు కూతురు సితార?

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార టాలెంట్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇప్పటికే తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ వివిధ రకాల పోస్టులు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది సితార. ఈ క్రమంలోనే తండ్రి మహేష్ బాబుకు తీసిపోని విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తరుచుగా తాను నృత్యం చేసే వీడియోలతోపాటు అందమైన చిత్రాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో తనకంటూ భారీసంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

ఆమధ్య మహేష్ నటించిన ‘సర్కారువారి పాట’ సినిమా ప్రమోషన్ కోసం తీసిన పాటలో అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ అవాక్కయేలా చేసింది. ఆ తరువాత హీరోయిన్ సాయి పల్లవి డాన్స్ చేసిన ఓ పాటకి డాన్స్ చేసి సాయి పల్లవికే ఛాలెంజ్ విసిరింది ఈ చిచ్చర పిడుగు. మొదటినుండి సీతార పాపకు డాన్స్ అంటే చాలా మక్కువ ఎక్కువ. అందుకే తనకు నచ్చిన పాటలకు డాన్స్ చేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే సితార బాలయ్య పాటకు డాన్స్ చేసి అటు నందమూరి అభిమానులకు ఇటు ఘట్టమనేని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.

ఇంతకీ ఆ పాట ఏమిటనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నా… బాలయ్య సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బంగారు బుల్లోడు సినిమాలో వచ్చిన ‘స్వాతిలో ముత్యమంత’ పాటకు డాన్స్ చేసి ఔరా అనిపించింది సితార. దాంతో నందమూరి అభిమానులు మా సితార పాప అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఘట్టమనేని అభిమానులు మాత్రం ఒకింత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్లకే స్టార్ అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ పాటలకు కాకుండా వేరే వాళ్ళ పాటలకు డాన్స్ చేసిందని నొచ్చుకున్నారట.

మహేష్ బాబు సినిమాలతోపాటు పలు సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయలను సంపాదిస్తున్న సంగతి విదితమే. కాగా తాజాగా సితార కూడా తండ్రి బాటలోనే బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగిన తీరు గురించి అందరు వినే వుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ జ్యూవెలరీ సంస్థ పీఎంజే తన బ్రాండ్ అంబాసిడర్ గా సితారను నియమించుకోవడం విశేషం. ఆమధ్య ప్రమోషనల్ యాడ్ ఫోటో షూట్ ను సదరు సంస్థ సితారతో నిర్వహించగా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన సంగతి విదితమే. సదరు యాడ్ లో నటించినందుకు సితారకు పీఎంజే జ్యువెలరీస్ సంస్థ భారీగానే ముట్టజెప్పిన సంగతి విదితమే!