గద్దర్ ఇక లేరని తెలిసి షూటింగ్ స్పాట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిన మహేష్ బాబు?

ప్రజా గాయకుడు గద్దర్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతదూరాలకు వెళ్లిపోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రజా గాయకుడిగా తన పాటలతో సమాజంలోని అసమానతలను వేలెత్తి చూపిన గద్దరన్న మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గద్దర్ మృతి చెందడంతో పలు జిల్లాలలోని ప్రజా గాయకులు, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో గద్దర్ పాడిన పాటలను పాడుతూ స్వర నీరాంజలి ఘటించారు. ఇక నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అయన మృతదేహాన్ని చూస్తూ కుమిలిపోయారు. పవన్ కళ్యాణ్ కి గద్దర్ కి వున్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే.

అది మాత్రమే కాకుండా సూపర్ స్టార్ మహేష్ కూడా గద్దర్ అంటే చాలా ప్రత్యేక అభిమానాన్ని కలిగి వుంటారు. ఈ విషయం ఆయన అనేకసార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు కూడా. ఇక సరిగ్గా నిన్న గుంటూరు కారం షూటింగ్ చేస్తున్న సందర్భంలో గద్దర్ మరణ వార్త తెలిసిన మహేష్ బాబు కాసేపు అలా స్తంభించి పోయారని వినికిడి. దాంతో ఆ కొద్దిసేపు దర్శకుడు త్రివిక్రమ్ షూటింగ్ కి విరామం ప్రకటించారట. ఇదే విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీకి గుర్తుగా తీసుకోవడం జరిగిందని చెబుతూ వుంటారు. గద్దర్ మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో పేద కుటుంబంలో జన్మించాడు. హైదరబాద్‌లో ఆయన ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారనే విషయం చాలామందికి తెలియదు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను అందరికీ తెలియజెప్పడానికి ఆయన బుర్రకథను ఓ మాధ్యమంగా ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేయడం కూడా జరిగింది.

1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” అనే పాటను కూడా రచించారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. ఆ తర్వాత కూడా ఆయన అనేక పాటలు రాశారు. 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్ష రాయగా ఉద్యోగం రావడంతో ఆయన కెనరా బ్యాంకులో క్లర్క్‌గా చేరారు. ఆ తర్వాతనే ఆయన వివాహం చేసుకున్నారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు కొడుకులు సూర్యుడు, చంద్రుడు… కూతురు వెన్నెల కలిగారు. వీరిలో కుమారుడు చంద్రుడు కొన్ని అనివార్య కారణాల వలన మరణించాడు.