రామ్ చరణ్, ఉపాసనలకు మొన్నామధ్య పండంటి కూతురు పుట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక మెగా ప్రిన్స్ కి లలితా సహస్రనామం నుంచి క్లింకారా అనే పేరుని ఖరారు చేసింది మెగా ఫామిలీ. ఈ క్రమంలో అనేకమంది జ్యోతిష్యులు యూట్యూబ్ వేదికగా మాట్లాడుతూ… అద్భుతమైన పేరు అని కొనియాడడం జరిగింది. ఇక పాప బారసాల ఏ స్థాయిలో జరిగిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. పాప తాత, నానమ్మలైన చిరంజీవి, సురేఖ దంపతులు ఈ పేరును చిన్నారి చెవిలో చెప్పి మురిసిపోయారు కూడా. కాగా రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీంతో మెగా ఇంట నేటివరకు సంబరాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇకపోతే పాప పుట్టిననాటినుండి పేరు పెట్టేవరకు ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ ఏ స్థాయిలో నడిచిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. జూన్ 20 తెల్లవారుజామున మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చింది. రామ్ చరణ్ , ఉపాసన పెళ్లి చేసుకుని పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడం మెగా ఫామిలీ పండగ చేసుకుంది. ఆ ఆనందాన్ని అలాగే నిలుపుతూ ఆరోజు మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డ పుట్టి.. మెగా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. తాము ఆంజనేయ స్వామిని ఆరాధిస్తామని, ఆ స్వామికి ఇష్టమైన రోజైన మంగళవారం నాడు పాప పుట్టడం సంతోషంగా ఉందని సాక్షాత్తు మెగాస్టార్ ఓ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి రాక తమ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు చిరంజీవి.
అంతేకాకుకండా చిరంజీవి పాప మంచి ఘడియల్లో పుట్టిందని, జాతకం కూడా చాలా బాగుందని అంటున్నారని తెగ పొంగిపోయారు. అంతేకాకుండా పాప ప్రభావం ముందు నుంచీ తమ ఫ్యామిలీలో కనబడుతుందని, రామ్ చరణ్ స్టార్ డమ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం, వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఇలా అన్నీ శుభాలే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. మనవరాలు పుట్టినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని.. ఇన్నేళ్ల తర్వాత మా చేతుల్లోకి పండంటి బిడ్డని రామ్ చరణ్ ఉపాసన పెట్టినందుకు.. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెగ ఆనందపడిపోయారు. కాగా రామ్ చరణ్, ఉపాసన అపోలో ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన సమయంలో వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ అందరికీ కృతజ్ఞతలు తెలపడం అందరికీ తెలిసిందే.
ఇక మెగాఫ్యామిలీకి, ఘట్టమనేని ఫ్యామిలీకి వున్న అవినాభావ సంబంధం గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. మొదటినుండి సూపర్ స్టార్ మహేష్ బాబుకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి వున్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసినదే. మొదట రామ్ చరణ్ కూతురిని చూడడానికి అపోలో ఆసుపత్రికి వెళ్లిన మహేష్ – నమ్రత దంపతులు… సందర్భం వచ్చినప్పుడల్లా మెగా ప్రిన్స్ పైన తమ అభిమానాన్ని చాటుకుంటూనే వున్నారు. బారసాల వేదికలో సందడి చేసిన ఈ ఘట్టమనేని ఫామిలీ క్లింకారా కోసం ఎలాంటి కానుక తీసుకెళ్లారో వేరే చెప్పాల్సిన పనిలేదు. కాగా తాజాగా ఉపాసన కూతురిని చూడడానికి వెళ్లిన నమ్రత డైమండ్ దిష్టి పూసలు గిఫ్ట్ గా ఇచ్చినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.