మెగాఫ్యామిలీకి షార్ట్ కట్లో అల్లుడు కాబోతున్న లవర్ బాయ్ తరుణ్?

ఒక్కప్పటి లవర్ బాయ్ తరుణ్ గురించి నేటి తరానికి తెలవకపోయినా, నిన్నటి తరానికి బాగా తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ ఇమేజ్ సంపాదించేసిన తరుణ్‌, ఆ తర్వాత సినిమా హీరోగా షార్ట్ టైంలో సూపర్ సక్సెస్‌ అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే అత్యంత తక్కువకాలంలో అంటే ఓవర్ నైట్ అంటారు చూడండి… అలా స్టార్ అయిపోయాడు. చూడ్డానికి లవర్ బాయ్ లా, పక్కింటి కుర్రాడిలా కనబడిన ఈ చిన్నోడు.. తనదైన యాక్టింగ్‌తో తెలుగునట మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఈ లవర్ బాయ్ ని బాగా ఇష్టపడేవారు. అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయిన తీరు దాదాపు అందరికీ తెలిసిందే.

తరుణ్ కెరీర్లో ‘నువ్వే కావాలి’ సినిమా ఒక ట్రేడ్ మార్క్ అని చెప్పుకోవాలి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు తరుణ్. ఆ తరువాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి చిత్రాలు మనోడికి భారీ విజయాన్ని అందించి పెట్టాయి. అయితే స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అతను నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి అలనాటి హీరోయిన్ రోజా రమణి ఓ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సదరు యాంకర్ ‘తరుణ్ పెళ్లి చేసే ఉద్దేశం ఎమన్నా వుందా?’ అని అడగగా హీరోయిన్ రోజా రమణి మాట్లాడుతూ…. ‘ఆ తరుణం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ వున్నాం. ఇప్పటికి మావాడు ఊ కొట్టాడు.’ అని చెప్పుకొచ్చింది. మరలా సదరు యాంకర్… ‘అమ్మాయి ఎవరు?’ అని అడగడంతో రోజారమని కాస్త నెమ్మదిగా ‘తెలుగు సినిమాకు సంబందించిన ఓ పెద్ద కుటుంబంలోని వారసురాలిని మా కోడలుగా చేసుకోబోతున్నాం!’ అని వెల్లడించింది. దాంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వెంటనే ఆ పెద్ద కుటుంబం ఎవరెన్ని మనోళ్లు తెగ వెతికేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగానీ విషయం మెగా ఫ్యామిలీ చుట్టూతా తిరుగుతోంది. అంటే ఎవరికి నచ్చింది వారు అనేసుకుంటున్నారు. కొందరు మెగాస్టార్ రెండో కూతురు శ్రీజ అని అంటుంటే, మరికొందరు నాగబాబు కూతురు నిహారిక అని కొందరు ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ కారణం లేకపోలేదు… ఆమె చెప్పినట్టు తెలుగు సినిమాకి సంబందించిన పెద్ద కుటుంబం అంటే మొదటగా వినబడేది మెగా ఫ్యామిలీనే. నందమూరి ఫ్యామిలీ అనుకుందామంటే అక్కడ అమ్మాయిలు లేరాయె. ఇక భర్తలనుండి విడాకులు తీసుకొని ఖాళీగా వున్నది ఈ ఇద్దరే. అందుకనే ఈ రూమర్స్ నడుస్తున్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో?