వరదల్లో కొట్టుకుపోయిన మహేష్ బాబు కారు… డిప్రెషన్లో నమ్రత?

అసలే వర్షాకాలం, అందులోనూ హైదరాబాద్. ఇక వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి? ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. సాధారణంగా అత్యధిక ట్రాఫిక్ పట్టణాల్లో వర్షాలు పడవని చాలామంది చెబుతూ వుంటారు. కానీ అది అబద్ధమని మన భాగ్యనగరాన్ని చూస్తే అర్ధం అయిపోతుంది. అవును, అత్యధిక వర్షాలతో ప్రస్తుతం ఇక్కడ పలుచోట్ల వరదలు కొనసాగుతూ వున్నాయి. ఒక్క తెలంగాణే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరి వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఇక గోదావరి పరివాహక ప్రాజెక్టులన్నీ దాదాపు జలకళ సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోందని తాజా సమాచారం. చెరువులు, కుంటలు నిండటం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక హైదరాబాద్‌లో జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ పరవళ్లు తొక్కుతోందని చెప్పుకోవచ్చు. మరో రెండు, మూడు రోజులు వర్షాలున్నాయనే సమాచారంతో యంత్రాంగం ప్రస్తుతం అప్రమత్తమైంది. రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గిపోయినా.. వరద జోరు మాత్రం కొనసాగుతోంది. దాంతో లోతట్టు ప్రాంత ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన ఇంటి లాన్లో పార్క్ చేసి వున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కారు ఒకటి వరదల్లో కొట్టుకుపోయినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఈ విషయం బయటకు తెలియడం ఇష్టంలేని మహేష్ దీనిని బయటకి చెప్పనట్టు తెలుస్తోంది. కానీ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు కళ్ళముందు అలా వరదల్లో కొట్టుకుపోవడంతో మహేష్ భార్య నమ్రత మాత్రం చాలా బాధపడుతున్నట్టు భోగట్టా.

అయితే, ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఘట్టమనేని అభిమానులు నమ్రతను ఓదార్చుతున్నట్టు సమాచారం. బోడి కారు పోతే ఏంటి వదినా! అన్నయ్య క్షేమంగా వున్నాడు కదా. అలాంటి కార్లు మరో పది కొనుక్కోవచ్చులే అని బుజ్జగిస్తున్నట్టు వినికిడి. అవును, ఒక్క కారు వారికి ఒక్క వెంట్రుకతో సమానం అని చెప్పుకోవచ్చు. మహేష్ ఒక్కో యాడ్ కే కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇక సినిమాల సంగతి అందరికీ ఎరుకే. అది చాలదన్నట్టు మన సితార బేబీ కూడా యాడ్స్ చేసేస్తోంది. అంతేకాకుండా తండ్రికి తగ్గట్టు రెమ్యునరేషన్ విషయంలో పోటీపడుతోంది.

ఇకపోతే నేడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిజాంసాగర్‌ 10 టీఎంసీలకు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అదేవిధంగా హిమాయత్ ​సాగర్ జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు 7 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో హిమాయత్ ​నగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేశారు. స్థానికులు, వాహనదారులు అక్కడ సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా హుస్సేన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తి వేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. మూసీ పరివాహక ప్రాంతాలను కూడా అధికారులు అప్రమత్తం చేసినట్టు సమాచారం.