Mahesh: మహేష్ బాబు ఒక్కడు సినిమా నేడు మరోసారి థియేటర్ల ద్వారా అభిమానుల ముందుకు వచ్చింది.. మహేష్ కెరీర్ లో ఒక్కడు సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఇరవై ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాను.. కబడ్డీ నేపథ్యానికి రాయలసీమ ఫ్యాక్షనిజం, ప్రేమకథను జోడించి దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించాడు. ఈ సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఎనిమిది నంది అవార్డులను దక్కించుకున్నది.
ఈ కల్ట్ క్లాసిక్ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఒక్కడు థియేటర్లలో రీ రిలీజ్ చేశారు.. ఒక్క ఏపీ, తెలంగాణలో కలిపి సుమారు 300 థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే వందకుపైగా థియేటర్లలో ఒక్కడు రీ రిలీజ్ అయింది. కేరళ, అమెరికాలలో కూడా ఈ సినిమా రీ రిలీజ్ చేస్తూ సంక్రాంతి వరకు థియేటర్లలో ఒక్కడు ఈ సినిమాను ఆడించబోతున్నట్లు సమాచారం. ఒక్కడు రీ రిలీజ్ కలెక్షన్స్ ఫస్ట్ డే కోటి రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మహేష్ బాబు పోకిరి గత ఏడాది రీ రిలీజ్ తొలిరోజు ఈ సినిమా 69 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. ఆ రికార్డ్‌ను ఒక్కడు అధిగమించడం తో పాటు ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తొలి రోజు కలెక్షన్స్ మహేష్ ఒక్కడు సినిమా తో బీట్ చేశాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి..