Balakrishna: నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డి.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో జరిగింది.. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య తన హెలికాఫ్టర్ లో వచ్చి మాస్ ఎంట్రీ ఇచ్చారు.. ఇక ప్రీ రిలీజ్ వేడుకలు ముగియడంతో నేడు శనివారం ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. కాకపోతే గాల్లోకి వెళ్లిన హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ సమస్యను గుర్తించిన పైలెట్ మళ్లీ ఒంగోలులోనే హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు..
అయితే బాలకృష్ణ ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారు. పైలట్ సకాలంలో సమస్యను గుర్తించడంతో అందరూ సురక్షితంగా ఉన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా గాలిలోకి ఎగిరిన హెలికాప్టర్ 20 నిమిషాల తర్వాత కిందకు వచ్చింది .టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ఒంగోలులో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెలికాఫ్టర్ను సేఫ్ గా ల్యాండ్ చేశారు .అయితే బాలకృష్ణ ఇప్పుడు హెలికాప్టర్ ప్రయాణం కంటే కూడా రోడ్డు ప్రయాణం మీదే చేస్తే మంచిదని అంతా భావిస్తున్నారు. బాలయ్య కు పెను ప్రమాదం తప్పిందని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ దేవుడికి రుణపడి ఉంటామని ప్రార్థనలు చేస్తున్నారు .మరోసారి బాలకృష్ణకు ఇలాంటి సమస్య రాకుండా నువ్వే కాపాడాలి అంటూ ప్రార్థనలు చేస్తున్నారు..