Avatar 2: అక్షరాలా 13,137 కోట్లు ఔట్…3 వీక్స్ అవతార్2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

Avatar 2: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ కి సీక్వెల్ గా వచ్చిన అవతార్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. బాక్స్ ఆఫీసు వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తూ 3 వారలను ని పూర్తి చేసుకుంది.. ఈ 3 వారాలలో అక్షరాలా 13,137 కోట్లు వసూలు చేసింది..

Avatar 2 collections are very highly collected..!
Avatar 2 collections are very highly collected..

విజువల్ వండర్‌గా అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ రోజు ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 40 మిలియన్ డాలర్లు పైగా వచ్చాయి. ఇక మొత్తంగా 3 వారాల్లోనే 1.590 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 13136.81 కోట్లు వసూలు చేసి రికార్డులు సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 2బిలియన్ డాలర్స్ ను అందుకోవాల్సి ఉండగా.. ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో ఆ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.. అవతార్ కచ్చితంగా ఆ ఫీట్ ను అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి..