రామ్ చరణ్ వారసుడిని చూడడానికి బయలుదేరిన మహేష్ బాబు?

గత కొన్నాళ్లుగా మనం గమనిస్తే ఇటు నెట్టింట అయినా, అటు మీడియాలో అయినా ఎక్కడైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన డెలివరీ గురించే చర్చ నడుస్తోంది. ఇన్నేళ్లుగా ఉపాసన ప్రెగ్నెంట్ కాలేదంటూ ఎన్నో రకాల ట్రోల్స్ ఆమెపై చేసిన జనాలు ఇపుడు ప్రెగ్నెంట్ అయిన ఆమె ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందాని ఎదురు చూస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ తమ కోడలు ప్రెగ్నెంట్ అయిన నాటినుండి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవును, మెగా కుటుంబానికి, మెగాభిమానులకు సంతోషకరమైన రోజులు రానేవచ్చాయి. మెగా కాంపౌండ్లో పండుగ వాతావరణం నెలకొంది.

కాగా ఇప్పటికే ఉపాసన డెలివరీ డేట్ లీక్ కావడంతో జనాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఆమె పండంటి బాబుకి లేదా పాపకి జన్మనివ్వబోనుంది అని అనుకుంటుండగా రెండువారాలు ముందే ఉపాసన డెలివరీ అయినట్టు తెలుస్తోంది. కాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు భోగట్టా. అయితే ఈ విషయాన్ని మెగా కుటుంబం బయట లీక్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని వినికిడి. కానీ విషయం అయితే దాక్కోదు కదా. ఈ విషయం కొద్ది సేపటి క్రితం సోషల్ మీడియాలో లీక్ కావడంతో జనాలు అవాక్కయిన పరిస్థితి. విషయం దేవుడికెరుకగానీ మెగాభిమానులు అయితే సంబరాల్లో మునిగిపోయారు.

ఇకపోతే విషయం తెలుసుకున్న టాలీవుడ్ బడా హీరోలు మెగా వారసుడిని చూడడానికి క్యూలు కట్టారట. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రామ్ చరణ్ కొడుకుని చూడడానికి సతీసమేతంగా వెళ్లినట్టు సమాచారం. ఇకపోతే ఉపాసన డెలివరీ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా అమెరికాలో ప్లాన్ చేసాడట. కానీ ఉపాసన తన సొంత హాస్పిటల్ అపోలోలోనే డెలివరీ చేయాలని మొండిపట్టు పట్టడంతో ఆమె ఇష్ట ప్రకారమే అపోలో హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రామ్ చరణ్.

అంతేకాకుండా ఉపాసన డెలివరీ కోసం ఓ ఫ్లోర్ మొత్తం బ్లాక్ చేసి పెట్టాడట రామ్ చరణ్. అంటే ఆ ఫ్లోర్ మొత్తం ఉపాసన డెలివరీ అయిన తర్వాత అక్కడ ఇతరులు ఎవరూ వుండరు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండేలా ప్లాన్ సెట్ చేసుకున్నారట. అంతేకాకుండా ఆ బ్లాక్ మొత్తం ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ కరోనా పరీక్షలు చేయించి మరి సిద్ధం చేయించారట. ఇంత చేస్తున్న మెగా ఫ్యామిలీ కేరింగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఇలాంటి ఫామిలీ… అత్తమామలు అలాగే భర్త ప్రతి ఒక్కరికి దొరకాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు.