మహేష్ బాబు కొత్త కార్వాన్ చూసి షాకైన విజయశాంతి!

టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆమె తన 30 సంవత్సరాల తెలుగు సినీ ప్రస్థానంలో తెలుగుతో పాటు అనేక భాషలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించి మెప్పించింది. అందుకే ఆమె అప్పట్లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఆమె దాదాపు 7 సార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. అదేవిధంగా ఆమె 4 రాష్ట్రాలకు సంబందించిన నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు ఇక్కడ నంది పురస్కారాన్ని అందుకుంది.

ఇక ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు సంపాదించడంతో ఆమె పేరు ఒక్కసారిగా దేశంలో మారుమోగిపోయింది. అంతేకాకుండా 1990లలో ఆమె సినిమా కథానాయకులతో సమానంగా ఎక్కువ పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు సాధించింది. అప్పటోలోనే ఆమె నటించిన కర్తవ్యం సినిమాకు గాను ఒక కోటి రూపాయలు తీసుకుంది. ఆ కాలంలో ఇతర ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్ అదే కావడం విశేషం. కట్ చేస్తే ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించి, టాలీవుడ్ కి షాకిచ్చింది.

ఇక అసలు విషయంలోకి వెళితే, సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. 2020లో సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి ఓ ప్రతేకత వుంది. అదే విజయశాంతి. విజయశాంతి ఎన్నో సంవత్సరాల తరువాత గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం విశేషం.

ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంలో మహేష్ బాబు వాడిన తన కొత్త కార్ వాన్ చూసి నటి విజయశాంతి విస్తుపోయిందట. ఇదే విషయాన్ని ఆమె ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. అలాంటి కార్ వాన్ ఆమె మునుపెప్పుడూ చూడలేదని, అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో యాంకర్ అల్లు అర్జున్ కార్ వాన్ గురించి ప్రస్తావించగా… మహేష్ కార్ వాన్ అల్లు అర్జున్ కార్ వాన్ కంటే ఎన్నో రెట్లు అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చిందట విజయశాంతి. దాంతో ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.