రాంచరణ్ – ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో తల్లిదండ్రులగా ప్రమోషన్ కొట్టేసారు. పెళ్ళైన చాన్నాళ్లకు వారికి బిడ్డ కలగడంతో మెగా ఫ్యామిలీ పండగ చేసుకుంది. అంటే సుమారు పెళ్లైన పది సంవత్సరాల తర్వాత చరణ్ – ఉపాసన తల్లిదండ్రులు కావడంతో చిరంజీవి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటికే తమ చిన్నారికి పేరును ఫిక్స్ చేసినట్లు అపోలో హాస్పిటల్ వేదికగా చరణ్ మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇక మొన్నటి రోజున రామ్ చరణ్ కుమార్తె బారసాల వేడుకను నిర్వహిస్తూ పాపకు క్లిన్ కారా (క్లీం..కార) అంటూ నామకరణం చేయడం జరిగింది.
ఏంటా వింత పేరు అని అనుకోవద్దు. లలిత సహస్రనామం నుండి ఈ పేరుని తీసుకున్నారు. లలిత సహస్రనామంలోని బీజాక్షరాలు ఈ అక్షరాలు. పాజిటివ్ ఎనర్జీని అలాగే ఆధ్యాత్మికతను నింపేలా చరణ్ – ఉపాసనలు ఈ పేరు పెట్టినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. క్లీం..కార అంటే అమ్మవారి రూపం అనే అర్ధం వస్తుంది అంటూ వేదపండితులు కూడా చెబుతున్న పరిస్థితి. ఇక క్లిన్ కారా బారసాలకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందులో ఆ పేరుకు అర్థం తెలుపుతూ కూడా ఓ ఫోటోను మెగా కుటుంబ సభ్యులు షేర్ చేశారు. దాంతో ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ బారసాల కార్యక్రమానికి తెలుగు పరిశ్రమనుండి హేమాహేమీలు అందరూ బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది. వాళ్లందరిలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అవును, ఈ కార్యక్రమానికి వెళ్లిన మన సూపర్ స్టార్ దంపతులు రామ్ చరణ్ కూతురికి కోటి రూపాయల బంగారు ఉయ్యాల కానుకగా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఊయలలో చరణ్ – ఉపాసన దంపతులు పాప క్లిన్ కారాను కాసేపు వేసి, అటుఇటు మురిపెంగా వూపినట్టు అక్కవున్న కొందరు సన్నహితులు ద్వారా తెలుస్తోంది. రామ్ చరణ్ – మహేష్ మధ్య వున్న స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే.
ఇక మహేష్ బాబు సినిమాల సంగతికి వస్తే, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా సంక్రాతి బరిలో నిలవనుంది. అదేవిధంగా చరణ్ సినిమాల సంగతికి వస్తే శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘గేమ్ ఛేంజర్ సినిమా’ పూర్తి చేసే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ రెండు సినిమాల పైన ఫుల్ హైప్ వుంది. అభిమానులు ఎప్పుడెప్పుడాని ఈ సినిమా గురించి వేచి చూస్తున్నారు. కాగా మహేష్ త్రివిక్రమ్ సినిమా తరువాత రాజమౌళి సినిమాని చేయడానికి సన్నద్ధమౌతాడు. ఇప్పటికే దానికి సంబంధించిన వర్కవుట్స్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.