Magician: నేటి ఇంటర్నెట్ యుగంలో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటే నమ్ముతున్నారు జనం.. అలా నమ్మే ఒక వ్యక్తి తన భార్యకు ఆరోగ్యం బాగోటం లేదని ఆ మాంత్రికు దగ్గరికి తీసుకువెళ్తే తన ఆరోగ్యం నయం అవుతుందని.. ఒకరు ఉచిత సలహా ఇస్తే అలాగే ఫాలో అయ్యారు. ఇక ఆ మాంత్రికుడు ఇంటికి వచ్చి ఏం చేశాడో తెలుసా.!?
తమిళనాడులోని నాగర్ కోవిల్ కు చెందిన మణికందన్ అనే మాంత్రికుడు దగ్గరికి.. ఓ కూలీ అతని భార్యకు అనారోగ్యంగా ఉండాలని తీసుకు వెళ్ళాడు. మా కుటుంబానికి ఎవరో ఏదో చేశారని .. మీరే మమ్మల్ని ఆదుకోవాలి అంటూ మణికందన్ మాంత్రికుడు కాళ్లపై పడ్డారు వారు. మంచి బకరా దొరికారు అనుకున్న మణికందన్ స్కెచ్ వేసి మీ ఇంట్లో పూజలు చేయాలి. అలా చేస్తే నీ ఆ భార్య ఆరోగ్యం కుదుటపడుతుందని తనకు వచ్చిన రోగం తగ్గిపోతుందని. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారని మాంత్రికుడు చెబుతాడు.
ఆ మాటలు నిజమైన అని నమ్మి ఆ కూలి వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి పూజలు చేయిస్తారు. తరచూ మణికందన్ వాళ్ళింటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. పూజలు చేసిన కూలికి ఓ 13వ ఏళ్లు వయసున్న కూతురు ఉంది. గత కొన్నాళ్లుగా ఇంటికి వస్తూ వెళ్తున్న మణి కందన్ మైనర్ బాలికపై కన్ను వేశాడు. పగటిపూట ఇంట్లో ఆ అమ్మాయి తప్ప ఇంకెవ్వరు ఉండరని తెలుసుకున్న ఓ రోజు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ అమ్మాయి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. నేను ఇంటికి వచ్చి వెళ్ళిన విషయం కానీ నీతో ఇలా చేసిన సంగతి గాని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు.
ఆ తరువాత ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీరు మున్నీరయింది. నాగర్ కోవిల్ మహిళా పోలీస్ స్టేషన్లో మణికందన్ పై బాలిక ఫిర్యాదు చేసింది పోలీసులు నకిలీ మాంత్రికుడు మణికందన్ అదుపులోకి తీసుకున్నారు. ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకి తరలించారు. ఇంకెంత మంది జీవితాలు బలి చేశాడో తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేస్తున్నారు.