Suma:యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు.. సుమ అంటే అంత పాపులర్.. బుల్లితెర మహారాణి.. స్మాల్ స్క్రీన్ పై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. సుమ మలయాళీ అమ్మాయి అయినా తెలుగింటి కోడలై.. అచ్చ తెలుగు అమ్మాయి మాటలతో మైమరిపిస్తుంది. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క ఓ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే సుమలో ఎవరికీ తెలియని ఓ విభిన్న కోణం ఉంది..
దశాబ్ధాలుగా తన యాంకరింగ్ తో సుమ బుల్లి తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ..
సుమ గురించి అంతగా తెలియని గొప్ప విషయం ఉంది. సుమ ఓ గొప్ప సామాజిక కార్యకర్త. నిస్సహాయంగా ఉన్న వారిని ఆదుకునే మంచితత్వం ఉంది. ఇంతకుముందే తను 30 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన సుమ వాళ్ళ పూర్తి బాధ్యతలు తనే తీసుకుంటున్నానని తెలిపారు.. ఇటీవల చెన్నైలోని జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాలను తెలిపింది.
సామాజిక సేవలో భాగంగా ఫెస్టివల్ ఫర్ జాయ్ అనే సంస్థను ప్రారంభించామని కూడా తెలిపారు. 30 మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారిని చదివించే బాధ్యతలతో పాటు అన్ని బాధ్యతలు స్వీకరించినట్టు తెలిపారు సుమ. విద్యార్థులంతా జీవితంలో స్థిరపడే వరకు సహాయం చేస్తుంటామని తెలిపారు. ఇది తెలిసాక అభిమానులు మనసున్న యాంకర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి పని చేస్తున్నావని ప్రోత్సహిస్తున్నారు. మునుముందు సుమ సామాజిక కార్యక్రమాలను చేయాలని కోరుకుంటున్నారు. ఇన్ని రోజులు ఈ విషయం సుమా ఎవరికీ చెప్పకుండా చాలా బాగా మెయింటైన్ చేశారు. మనం చేసే మంచి పని మన ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు. అందులో భాగంగానే సుమ ఇప్పటివరకు ఈ పనిని ఎవ్వరికీ తెలియకుండా ఉంచిందని అంతా ఆమె మంచి మనసుకి ఫిదా అవుతున్నారు.