Actor: ఎటువంటి సపోర్టు లేకుండా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నట్లు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. వరుసగా పలు భారీ ప్రాజెక్టులతో కెరీర్లో దూసుకెళ్తున్నాడు .. కాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ వేధిస్తున్నాడంటూ ఆమె భార్య ఆలియా అంచనా ఆరోపణలు చేసింది.. తాజాగా ఆమె లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీ సైతం ఆరోపణలు చేశారు..
నవాజుద్దీన్ సిద్ధిఖీ కి తన భార్య అలియా కి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పాస్ పోర్ట్ సమస్యలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలియా ముంబై బాంద్రాలోని సిద్ధిఖీ ఇంటికి వచ్చింది. అయితే అక్కడ ఆమె ఉండే అర్హత లేదు అంటూ నవాజుద్దీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆలియా ఆరోపించింది.
నవాజుద్దీన్ తనను బాధపడుతున్నారని ఆలియా తెలిపింది కనీసం నాకు అన్నం పెట్టడం లేదు. స్నానం చేసేందుకు వెళ్లనివ్వడం లేదు.. ఆఖరికి బాత్రూంకు వెళ్లడం లేదు.. హాల్లోనే ఉంచి సీసీ కెమెరాలు అమర్చారు అని.. ఆమె చుట్టూ బాడీగార్డ్స్ ను ఉంచారు ఈ విషయంలో కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు అరెస్టు చేయిస్తామని బెదిరించారు.
ప్రతిరోజు పోలీసులకు ఫోన్ చేస్తున్నారు నవాజుద్దీన్ అతని కుటుంబం సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లైంట్ కు ఆహారం పెట్టలేదు. ఆమె ఉన్న హాల్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు . ఆమె ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు అంటూ రియాజ్ కూడా ఆరోపణలు చేశారు. ఆలియా అడ్వకేట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. కాగా కొత్త గత కొంతకాలంగా జరుగుతున్న గొడవల కారణంగా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.