Schemes : ఈ పథకాలలో చేరడానికి ఈ నెల ఆఖరి రోజు..!!

Schemes : ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం లలో మీరు కూడా డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నారా అయితే అందుకు కొన్ని ప్రత్యేకమైన పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటి గడువు కేవలం 2022 మార్చి 31వ తేదీ చివరి తేదీ కావడం గమనార్హం. మరైతే స్కీమ్స్ ఏమిటి మనకు ఎలా ఆదాయం వస్తుంది అనే విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులను చాలామంది ఫిక్స్ డిపాజిట్ అకౌంట్లో దాచుకొని ప్రతి నెలా వడ్డీ పొందే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక బ్యాంకు లలో ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా డబ్బులు దాచుకునే వారు సామాన్య కస్టమర్ల తో పాటు సీనియర్ సిటిజన్లు కూడా అదనపు వడ్డీ ఇస్తూ ఉండడం గమనార్హం.

ఫిక్స్డ్ డిపాజిట్ల కాలవ్యవధి విషయానికి వస్తే.. ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాలవ్యవధితో మనకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఇచ్చేందుకు ప్రత్యేక స్కీం లు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రభుత్వానికి చెందినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన ఫిక్సిడ్ డిపాజిట్ స్కీంను అందించడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా వృద్ధులకు 0.5 శాతం వడ్డీ కూడా అదనంగా లభిస్తుంది. ముఖ్యంగా రూ. రెండు కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు ఏడు రోజుల నుంచి మూడు సంవత్సరాల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు.

Last day of this month to join these schemes
Last day of this month to join these schemes

ఇకపోతే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు టెన్యూర్ ఎంచుకుంటే 0.65 శాతం.. ఐదు నుంచి పది సంవత్సరాల టెన్యూర్ ఎంచుకుంటే ఒక శాతం వడ్డీ కూడా అదనంగా లభిస్తుంది. సామాన్యులకు కూడా ప్రత్యేకమైన వడ్డీరేట్లు అందివ్వడం జరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఇందులో కూడా 0.75 శాతం వడ్డీని అధికంగా పొందవచ్చు. ఇందులో ఐదు సంవత్సరాల ఒక రోజు నుంచి పది సంవత్సరాల కాల వ్యవధిలో రూ. 5 కోట్ల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన వారికి మాత్రమే అదనంగా ఈ వడ్డీ శాతం లభించడం గమనార్హం. ఈ రెండింటి పథకాలలో చేరడానికి చివరితేదీ 2022 మార్చి 31వ తేదీ. ఇక మీరు కూడా ఈ పథకాలలో చేరి మంచి వడ్డీని అందుకోవచ్చు.