Financially Problems : ఎవరైనా సరే ఆర్థికంగా నష్టపోకుండా భవిష్యత్తులో డబ్బు పరంగా సంతోషంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే యుక్తవయసులో సంపాదించేటప్పుడే జాగ్రత్తగా భవిష్య నిధి కోసం ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేస్తూ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ముందస్తు ఆర్థిక ప్రణాళికలు లేకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులు.. ఫలితం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నారు. వారిలో మీరు కూడా ఒకరైతే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను ఆచితూచి పాటించాల్సి ఉంటుంది.ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే బడ్జెట్ ప్లాన్ తప్పకుండా వేసుకోవాలి.
సమస్య ఎక్కడ వచ్చింది.. ఎందుకు వచ్చింది.. ఎలా వచ్చింది అని విశ్లేషణ జరపాలి. ఫైనాన్షియల్ ప్రాపర్టీస్ ని కూడా సెట్ చేయాలి. మీకు వచ్చిన ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. మీ సమస్యను గుర్తించినప్పుడు.. ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాము అనే విషయాన్ని గుర్తించుకోవాలి. సమస్య పరిష్కారానికి సరైన మార్గం తెలుసుకొని ఆచితూచి పాటించాలి . అప్పుడే సమస్యను త్వరగా దూరం చేసుకోవచ్చు.ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది.. ఎన్ని మార్గాల నుంచి వస్తుంది అనే విషయాలను సమకూర్చుకోవాలి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు.
ఎంత అవసరం ఉండి ఖర్చుపెడుతున్నారు అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. మీకు వచ్చే నెల వారి జీవితంలో బడ్జెట్ ప్లాన్ వేసుకొని దేనికి ఎంత ఖర్చు చేయాలో తెలుసుకొని అవసరమైతేనే ఖర్చు చేయాలి లేదు అనుకుంటే ఆ డబ్బులను ఆదా చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా పిల్లల కోసం చిల్డ్రన్స్ ప్లాన్స్, ఇన్సూరెన్స్ ప్లాన్స్ లాంటివి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ ప్లాన్స్ వల్ల ఆర్థిక ఇబ్బంది రాదు.బడ్జెట్ ప్రణాళిక ద్వారా డబ్బులు ఖర్చు చేసుకోవడం.. అలాగే డబ్బులు సంపాదించడం లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా ఒక ప్రణాళిక లోనే మీరు వెళ్తారు కాబట్టి ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఉండదు.