Health Benefits : మీ పెరట్లో ఈ మొక్క ఉంటే ఇంటిల్లపాదికి రోగాలు రావు..!

Health Benefits : ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండి తీరాల్సిన మొక్కలలో వాము మొక్క కూడా ఒకటి.. ఈ మొక్క లోని అన్ని భాగాలు ఘాటైన సువాసన కలిగి ఉంటాయి.. ఇందులో కార్బోహైడ్రేట్స్ , విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.. ఈ ఆకులను పచ్చిగా తిన్నా కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..!వాము ఆకులను పచ్చిగా తినచ్చు.

లేదంటే బజ్జిగా చేసుకుని తినవచ్చు. పప్పులో వేసుకోవచ్చు. వాము గింజలను నేరుగా తీసుకోవచ్చు. కడుపు నొప్పికి, నులుపురుగులు తగ్గించడానికి వాము అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకులను కానీ గింజలను నేరుగా తింటే సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. వాము ఆకుల రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

health benefits in Ajwain Leaves
health benefits in Ajwain Leaves

దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. వాము నీరు తాగితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.వాము ఉండే యాంటీ బయోటిక్, అనస్తిటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి కాళ్ళ నొప్పులను, కండరాల వాపులను తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. వాము ఆకులను నమిలితే జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం ను నివారిస్తుంది. వాము లో కాస్త ఆవనూనె వేసి ఇంట్లో ఒక మూలన ఉంచితే దోమలు పరార్.