Health Benefits : చింత పువ్వు లాభాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

Health Benefits : చింత చెట్టు నుండి వచ్చే చింత ఆకు, చింత చిగురు, చింత బెరడు, చింత కలప , చింతకాయలు మనకు రకరకాల ఆరోగ్యప్రయోజనాలను కలుగజేస్తాయని అందరికి తెలిసిందే.. అందుకే మన భారతదేశపు ఖర్జూర చెట్టు గా పరిగణిస్తారు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు తొలకరి చినుకులకు చింత చెట్టు నుండి వచ్చే చిగురు అలాగే పూత ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేస్తుంది అని వైద్యులు సైతం చెబుతున్నారు. ఈ చింత బెరడును ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.. ముఖ్యంగా చింత ఆకులు, కాయలు, పూత తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం ఒకసారి తెలుసుకుందాం.

సాధారణంగా చింత గింజలను ఎక్కువగా కాఫీ పొడి లో ఉపయోగిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చింతగింజల పొడి లో మనకు ఎక్కువగా కాల్షియం లభిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఈ చింత విత్తనాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఆకలి మందగించినా లేదా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక పోయినా చింతపండు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని చింతపండు రసంతో వాపు ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా మర్ధన చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగి ఉండే ఈ చింతపండు పులి తేపులను అరికట్టడానికి కడుపు ఉబ్బరానికి మొదలైన రోగాలకు మందుగా ఉపయోగిస్తారు.

Health benefits of tamarind Flower
Health benefits of tamarind Flower

మూత్రకోశ వ్యాధులు, మూత్రకోశంలో రాళ్ళు వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి ఆకలి మందగించిన వారు ప్రతిరోజు నాలుగు టేబుల్ స్పూన్ల చొప్పున చింతపండు రసం తాగితే మంచి ఆకలి పుడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిం చడానికి .. అజీర్తికి కూడా చింతపండు ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. చింత చిగురు లో మనకు విటమిన్ సి, విటమిన్ ఈ తో పాటు ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా యూరిన్ లో మంట , కఫం, పిత్త సమస్యలు, జలుబు, దగ్గు, క్యాన్సర్ వంటి సమస్యలను నివారించడంలో చింత పువ్వు చాలా చక్కగా పనిచేస్తుంది.