LakshmiDevi : మీకు అదృష్టం వస్తోందంటే ఈ సంకేతాలు కనిపిస్తాయట..!!

Lakshmidevi : ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి వస్తోందంటే చాలు ఎవరైనా ఆనందపడతారు. అయితే అలాంటి లక్ష్మీదేవి తొందర్లోనే మన ఇంటి తలుపు తట్టి పోతోందని తెలిపే సంకేతంగా కొన్ని విషయాలు ముందుగానే మనకి గుర్తుగా కనిపిస్తాయట. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.లక్ష్మీదేవి తొందర్లోనే ఇంటికి వస్తుంది అనే సందర్భం ఏమిటంటే.. ఉదయం లేవగానే ఎవరికైనా సరే కొబ్బరికాయ కనిపిస్తే మాత్రం వారికి అదృష్టం రాబోతోందని అర్థం. లేదంటే చాలా మంచి జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు.. అలాగే మనం ఉదయం పూట నిద్ర లేవగానే బయటికి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే.

. ఏదైనా ఒక తెల్లటి పక్షి మన ముందు వెళ్లినట్లు అయితే దీన్ని బట్టి కూడా మనకు త్వరలోనే అదృష్టం రాబోతోందని గుర్తుంచుకోవచ్చు.ఇక మరొకటి ఏమిటంటే.. మనం ఉదయం లేచినప్పుడు ఏదైనా ఆవు గడ్డి మేస్తూ కనిపించింది అంటే మీరు త్వరలోనే ధనవంతులు అవుతున్నారని సంకేతం అని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఆవు అనేది సకల దేవతలకు సంకేతము. మరికొంతమందికి రాత్రిపూట కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించిన వారికి ఏదైనా సర్పదోషం ఉంటుందేమో అని అందరూ అనుకుని భయపడుతూ ఉంటారు. అయితే మనకి కనిపించిన పాము ఏ పొజిషన్లో కనిపించిందో దాన్నిబట్టి కూడా మనకు తొందరలోనే అదృష్టం రాబోతోందని గుర్తించుకోవాలి.

Lakshmidevi If you are lucky you will see these signs
Lakshmidevi If you are lucky you will see these signs

ముఖ్యంగా శ్వేత నాగు లాగా కనిపిస్తే త్వరలోనే మనకి మంచి జరగబోతోందని అర్థం.. ఒకవేళ తెల్లని పాము వలె కనిపించినచో త్వరలోనే మనకు రాజయోగం తప్పకుండా వస్తుంది అని గుర్తించాలి.. ఒకవేళ పాము ఏదైనా పడగ విప్పి కలలో కనిపించినట్లైతే త్వరలోనే మీరు ఒక అధికారిగా వెళ్తారు అని అర్థం. ఒకవేళ మీ కలలో పాము కనిపించింది..అది పాక్కుంటూ వెళితే అది మీకు నాగ దోషము అని అర్థము.. ముఖ్యంగా ఇందులో తెల్లటి పక్షి అనేది శాంతికి సంకేతము.. కొబ్బరికాయ అనేది శివుడికి ఎంతో ఇష్టమైనది. ఇక ఇలాంటివి మీకు జరిగితే త్వరలో మీరు అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం.