Hair Tips : జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఇలా చేయండి..?

Hair Tips : ఎవరైనా సరే ఒత్తుగా.. పొడవుగా నిగనిగలాడే జుట్టు కావాలని కోరుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జుట్టు అనేది స్త్రీ యొక్క కళ అని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన జుట్టు పెరగడం అంటే అంత సులభం కాదు మీరు పాటించే ప్రత్యేక శ్రద్ద కారణంగా వేగంగా పెరగడం .. ఒత్తుగా పెరగడం లాంటివి జరగవచ్చు. ఇకపోతే ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన ఉత్పత్తులతో జుట్టును ఒత్తుగా.. ఆరోగ్యంగా.. పొడవుగా పెంచుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.విరివిగా దొరికే కాయగూరలలో దోసకాయ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా వేగవంతమైన జుట్టు పెరుగుదల కోసం దోసకాయను ఉపయోగించి సహజంగా తయారుచేసిన హెయిర్ మాస్క్ తో ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు.. దోసకాయ తో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం..ముందుగా ఒక చిన్న దోసకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక చిన్న కప్పు పెరుగు, ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇక ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలను తీసుకుని బ్లెండర్లో వేయాలి.. ఇప్పుడు పెరుగు ,ఆపిల్ సైడర్ వెనిగర్, ఆలివ్ ఆయిల్ వేసి మెత్తటి పేస్టులా తయారు చేయాలి.

Do this to grow hair thicker and longer
Do this to grow hair thicker and longer

ఇక దీనిని మీ జుట్టు అలాగే తలపై పూర్తిగా అప్లై చేసి చివరలను కూడా పూర్తిగా కప్పేలా హెయిర్ మాస్క్ వేయాలి. 20 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు గాఢత తక్కువగా కలిగిన షాంపుతో తలస్నానం చేయాలి.ఈ హెయిర్ మాస్క్ వల్ల మీకు ఇందులో లభించే విటమిన్ సి, ఎ, సిలికా కారణంగా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది అంతేకాదు స్కాల్ఫ్ మృదువుగా మారి తలలో ఎలాంటి చుండ్రు, మంట లేకుండా కాపాడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని ఆపి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.