Married : మీరు వివాహం చేసుకున్న నెలను బట్టి అదృష్టం ఎలా ఉంటుందంటే..!!

Married : ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు అని చెప్పవచ్చు. అయితే ఇది జనవరి నుండి డిసెంబరు వరకు కొన్ని ప్రత్యేక నెలలతో కూడి ఉంటుంది. అయితే ఏ నెలలో వివాహం చేసుకుంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అనే విషయానికి వస్తే..

1). జనవరి-ఫిబ్రవరి : జనవరి నెలలో.. ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నట్లు అయితే దంపతులు ఒకరినొకరు ఆశ్చర్యకరమైనటువంటి బహుమతులు ఇచ్చుకుంటారట. కానీ వారి జీవితం మాత్రం ఎంతో సాదాసీదాగానే జరుగుతుంది. 2). మార్చి, ఏప్రిల్ : ఈ నెలలలో వివాహం చేసుకున్నట్లయితే మీరు ఎంతో రొమాంటిక్ గా ఒకరినొకరు బాగా ఇష్టపడుతూ వారి యొక్క కుటుంబ సభ్యుల బాధ్యతలను కూడా మోస్తూ ఉంటారు. ఒకరినొకరిని కలుపుకొని ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

How lucky are you depending on the month you got married
How lucky are you depending on the month you got married

3). మే,జూన్ : ఈ నెలలో వివాహం చేసుకున్న వారు ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చుకోరు.. జీవిత భాగస్వామికి సంబంధించిన.. కుటుంబ బాధ్యతలను కూడా పట్టించుకోరు. కానీ జీవితం సాదాసీదాగానే నడుస్తుంది. 4). జూలై ,ఆగస్టు : ఈ నెలలో వివాహం చేసుకున్నవారు ఎక్కువగా ప్రణాళికబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తూ తమ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇక వారికి పుట్టబోయే పిల్లల జీవితాన్ని కూడా ప్లాన్ చేస్తూ కొనసాగుతూ ఉంటారు.

5). సెప్టెంబర్, అక్టోబర్ : ఇక ఈ నెలలో వివాహం చేసుకున్న వారు.. ఒకరినొకరు ప్రాణంగా చూసుకుంటారు. ఎక్కువగా.. సరదాగా బయటికి వెళుతూనే ఉంటారు. ఇక వారి జీవితాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.6). నవంబర్, డిసెంబర్ : ఈ నెలలలో వివాహం చేసుకున్నవారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు.. అయితే వాళ్ళని చూసినవారందరూ ఇతరులు ఎవరైనా సరే వాళ్ళ అలాగే మనం కూడా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ నుంచి జనవరి నెల మధ్యలో ఎవరైనా సరే వివాహం చేసుకుంటే వారి వివాహ బంధం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.

అయితే వీటన్నిటినీ సంఖ్యాశాస్త్ర పరంగా నే చూడడం జరిగింది.