Beauty Tips : ఎండాకాలంలో చర్మాన్ని చల్లగా ఉంచడానికి ప్రతి ఒక్కరు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఐస్ క్యూబ్స్ తో చర్మానికి ఒక చక్కటి పరిష్కారాన్ని తీసుకురావచ్చు. ఇకపోతే ఐస్ క్యూబ్స్ వల్ల ప్రయోజనాలు ఇప్పటివరకు తెలియని వారు ఉంటే ఈ కథనం ద్వారా తెలుసుకొని ప్రయోజనం పొందవచ్చు. వేసవి కాలంలో కూల్డ్రింక్స్ తో పోల్చుకుంటే ఐస్ క్యూబ్స్ ఎక్కువ ఫలితాన్ని అందిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో మీ అందానికి సంబంధించిన కష్టాలను తీర్చడానికి చాలా రకాలుగా ఇవి ఉపయోగపడతాయి. ఐస్ క్యూబ్స్ ఉపయోగించేటప్పుడు
నేరుగా ముఖం మీద పెట్టకుండా కాటన్ క్లాత్ తీసుకొని అందులో నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసి ఆ తర్వాత ఉపయోగించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.క్లాత్ లో చుట్టిన ఐస్ క్యూబ్స్ తో ముఖంపై మర్దనా చేయడం వల్ల కేవలం రెండు నిమిషాల్లోనే ముఖం చాలా తాజాగా మారుతుంది అని ఎండకు ఏర్పడిన ట్యాన్ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉబ్బిపోయిన కళ్ళను తగ్గించడానికి ఐస్ క్యూబ్స్ ఉత్తమ మార్గం అని చెప్పాలి. ఇందుకోసం ఒక క్లాత్ లో ఐస్ క్యూబ్స్ వేసి కంటి ప్రాంతంలో సుమారుగా పది నిమిషాల పాటు మర్దన చేయడం వల్ల తగ్గుతాయి.
ఎండాకాలంలో ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాదు ఎండవల్ల చర్మం పై పలు ప్రాంతాలలో చర్మం నల్లగా మారే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్ తో ప్రభావిత ప్రాంతాలలో రుద్దడం వల్ల చర్మం నుండి వచ్చే వేడిని గ్రహించి ముఖం తాజాగా మెరిసిపోతుంది. అంతే కాదు వేడి , మొటిమలను తగ్గించడంలో కూడా ఐస్ క్యూబ్స్ చాలా బాగా పనిచేస్తాయి. అమ్మాయిలు అందంగా ఉండటానికి కనుబొమ్మలకు త్రెడ్డింగ్ లాంటివి చేస్తూ ఉంటారు . అలా చేసినప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ క్యూబ్ తో మర్దనా చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.