Lakshmi Pranathi.. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి చాలా సౌమ్యంగా కూల్ గా కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే ఈమె మంచితనంలో కూడా ఎన్టీఆర్ నే మించిపోయిందంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే తారకరత్న 39 సంవత్సరాల వయసులోనే స్వర్గస్తులవడంతో ఆయన భార్య ఒంటరి అయిపోయింది. ఇప్పుడు ఆమెకు మానసికంగా బలాన్ని చేకూర్చాలి. ఇలాంటి సమయంలో లక్ష్మీ ప్రణతి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అలేఖ్య రెడ్డికి తోడుగా ఉండబోతుందని సమాచారం.
తారకరత్న మరణించిన తర్వాత అలేఖ్యరెడ్డి మానసికంగా మరింత క్షోభ ను అనుభవిస్తున్న నేపథ్యంలో ఆమె దగ్గరకు వెళ్లిన లక్ష్మీ ప్రణతి జీవిత పాఠాలు బోధిస్తోందట. తారకరత్న మరణంతో నీ జీవితం అయిపోలేదు.. పిల్లలు ఉన్నారు ..వారి భవిష్యత్తు కోసం నువ్వు ఆరాటపడాలి.. జీవితంలో నువ్వు అనుకున్న కలను నెరవేర్చుకోవాలి అని ఆమె మనసుకు స్వాంతన కలిగేలా మాట్లాడుతుందని సమాచారం. క్లిష్ట పరిస్థితుల్లో ఎంత డబ్బు ఉన్నా మనసుకు దగ్గరగా ఉన్నవారు మనతో ఉంటేనే ఆ బాధ కొంతవరకు తగ్గుతుందని నిర్ణయించుకున్న లక్ష్మీ ప్రణతి అలేఖ్య రెడ్డికి అండగా నిలవనుందని సమాచారం.