Breaking: భూమా మౌనిక రెడ్డి తో మంచు మనోజ్ పెళ్లి.. డేట్ ఫిక్స్..!

Breaking.. ఎట్టకేలకు మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డి తో వివాహానికి సిద్ధమయ్యారు. మార్చి మూడవ తేదీన వీరి పెళ్లి జరగబోతోంది అంటూ వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. గత కొంతకాలంగా ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం భూమా దంపతుల రెండవ కుమార్తె మౌనిక రెడ్డి తో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే వీరి ప్రేమకు మంచు ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం వల్లే.. కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

Manchu Manoj And Fiancee Bhuma Mounika Reddy's Ganesh Pandal Visit Sparks  Marriage Rumours! - Filmibeat

గత కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ కడపలో ఉన్న పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గాను దర్శించుకొని ఫిబ్రవరి నుంచి కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో కొత్త సినిమాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రాగా.. ఫిబ్రవరి రెండు 2023లో పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు బలంగా వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 3వ తేదీన వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. అయితే ప్రతి కొద్దిమంది కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.